శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు కనిపించే లక్షణాలు ఇవే..!
posted on Sep 30, 2024 @ 9:30AM
కొలెస్ట్రాల్ శరీరానికి చాలా అవసరమైన పదార్థం. కొలెస్ట్రాల్ లో బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ అని రెండు రకాలు ఉంటాయి. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన కొవ్వులు అవసరం. అలా కాకుండా చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ అయితే ఫ్యాటీ లివర్, గుండె సంబంధ సమస్యలు, ఊబకాయం వంటి సమస్యలు వస్తాయి. శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడానికి అనేక కారణాలు ఉంటాయి. అయితే శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలను బట్టి కొలెస్ట్రాల్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవచ్చు..
కొలెస్ట్రాల్ అంటే..
కొలెస్ట్రాల్ అనేది శరీరం అనేక ముఖ్యమైన విధులు నిర్వర్తించడానికి సహాయపడే ఒక లిపిడ్. ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ శరీరానికి ఎంత అవసరమో.. చెడు కొలెస్ట్రాల్ శరీరానికి చేసే చేటు అంతకంటే దారుణంగా ఉంటుంది.
కొలెస్ట్రాల్ ఎక్కువైతే కనిపించే లక్షణాలు..
కొలెస్ట్రాల్ ఎక్కువ అయితే ఛాతీ నొప్పి వస్తుంది. లేకపోతే ఛాతీ భాగంలో ఒత్తిడి కూడా ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఎవరికైనా కనిపిస్తే వైద్యులను కలవడం, కొలెస్ట్రాల్ పరీక్ష చేయించుకోవడం మంచిది.
ఎప్పుడూ అలసటగా అనిపించడం, శరీరంలో శక్తి లేనట్టు ఉండటం కూడా కొలెస్ట్రాల్ లెవల్స్ పెరిగాయనడానికి సంకేతం.
శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే పాదాలు, చీల మండలలో వాపు ఉంటుంది. కొలెస్ట్రాల్ రక్త ప్రవాహంలో అడ్డంకులు ఏర్పరచడం వల్ల ఇలా పాదాలలో వాపులు వస్తాయి.
కంటి చూపు మందగించడం కూడా కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువ ఉండటాన్ని సూచిస్తుంది. కంటి చూపు మసకగా ఉండటం, దృష్టి విషయంలో తేడాలు ఉండటం మొదలైనవి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం వల్ల జరుగుతుంది.
శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే చర్మం పై మచ్చలు వస్తాయి. చర్మం పై మచ్చలు ఏర్పడుతుంటే వైద్యులను సంప్రదించాలి.
*రూపశ్రీ.