నీటితో ఆట.. నీటిపై మృత్యువాత..
posted on Mar 23, 2021 @ 11:42AM
కొందరిని వారి సరదానే ప్రాణం తీస్తుంది. మరి కొందరిని వాళ్ళ పాపం ప్రాణం తీస్తుంది.. చాలా మందిని వారి వయసు ప్రాణం తీస్తుందని తెలుసు. కానీ, ఎప్పుడైనా ఒక లక్ష్యం కోసం ప్రయత్నిస్తుండగా ఆ లక్ష్యం వారి ప్రాణాలు తీస్తుందనుకుంటారా..? అనుకోరు, ఎందుకంటే.. అలా జరుగుతుందని భయపడితే ఎవరు తమ లక్షణాన్నిసాధించలేరు. ఇక్కడ మాత్రం ఆమె లక్ష్యమే తన ప్రాణం తీసింది. వాటర్ పై పయనించడమంటే ఆమెకు మహా సరదా. అందుకే సర్ఫింగ్ క్రీడా నేర్చుకుంది. క్రీడతో పాటు ఆమెకు దేశ భక్తి కూడా ఎక్కువే అందుకే టోక్యో ఒలింపిక్స్‌లో తొలిసారిగా సర్ఫింగ్ క్రీడను ప్రవేశపెట్టబోతున్నారని తెలిసిన ఆమె క్రీడాకారిణి ఆనందానికి సద్దులు లేవు. ఎలాగైనా ఒలంపిక్స్ లో ఎలాగైనా అర్హత దాచింది దేశానికి స్వర్ణ పధకం సాధించాలని. కలకంది. కానీ చివరికి ఆ కల కలగానే మిగిలిపోయింది.
ఒలింపిక్స్‌లో తొలిసారిగా సర్ఫింగ్ క్రీడను ప్రవేశపెట్టబోతున్నారని. ఆ క్రీడాకారిణి సంతోషంలో మునిగి. ఎలాగైనా ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలని పట్టుదలతో సాధన మొదలెట్టింది. నీటి అలలపై తేలింది. క్రీడలో ఆరితేరేందుకు తీవ్రంగా శ్రమించింది. నీళ్లే తన శ్వాసగా, ద్యాసగా, ప్రాణంగా బతికిన ఆ అమ్మాయి.. చివరికి నీటిలోనే ప్రాణాల తో పాటు తన లక్ష్యాన్ని వదిలింది. ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించాలనే కల తీరకుండానే అందరికి కన్నీళ్లు మిగిల్చిచి , తాను పిడుగుపాటుకు గురై మరణించింది.
ఆమె సాల్వడోర్‌కు చెందిన 22 ఏళ్ల కేథరిన్ డియాజ్. ఆ దేశంలోని అగ్రశ్రేణి సర్ఫర్ అయిన తను ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్ కోసం సిద్ధమవుతోంది. ఆ ఒలింపిక్స్‌కు అర్హత టోర్నీ అయిన ప్రపంచ సర్ఫ్ క్రీడల కోసం సాధన చేసేందుకు సముద్రంలోకి వెళ్లిన తను.. అక్కడే పిడుగుపాటుకు గురై కిందపడిపోయింది. వెంటనే అత్యవసర సహాయక సిబ్బంది ఆమెను ఒడ్డుకు చేర్చినప్పటికీ టుంకో బీచ్‌లోనే తుదిశ్వాస విడిచింది. తమ దేశానికి ప్రాతినిథ్యం వహించిన గొప్ప అథ్లెట్ మమ్మల్ని విడిచి వెళ్లిపోయింది. ఆమె గొప్ప యోధురాలని . దేశం బాధతో కన్నీళ్లు పెడుతోంది అని ఆ దేశ సర్ఫ్ సమాఖ్య సామాజిక మాధ్యమాల్లో పోస్టు తెలుపుతుంది.