ఇమ్రాన్ అరెస్ట్ పై సుప్రీం సీరియస్
posted on May 11, 2023 @ 6:04PM
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ ను పాకిస్థాన్ సుప్రీంకోర్టు తప్పు పట్టింది. రిజిస్టార్ అనుమతి లేకుండా 90 మంది కోర్టు ప్రాంగణంలోకి వచ్చి అరెస్ట్ చేయడాన్ని సుప్రీం కోర్టు సహించలేకపోయింది. న్యాయస్థానాన్ని అగౌరవ పరిచే చర్య అని సుప్రీం వాఖ్యానించింది.
ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తర్వాత పాకిస్థాన్ భగ్గుమంది. ఆయన అభిమానులు రోడ్ల మీద నిరసనలు చేపట్టారు.వందలాది ఇమ్రాన్ అభిమానులను ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఇమ్రాన్ ను మళ్లీ కోర్టులో గంటలోపు హాజరుపర్చాలని సుప్రీం ఆదేశించింది. ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ విషయంలో చాలాకాలంగా పాకిస్థాన్ లో చర్చనీయాంశంగా ఉంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని కోర్టులో వచ్చి లొంగిపోతాను అని గతంలో స్టేట్ మెంట్ ఇచ్చారు. కానీ అతను లొంగిపోకపోవడంతో ఇస్లామాబాద్ పోలీసులు ఇమ్రాన్ ఇంటిని చుట్టుముట్టారు. దీంతో అభిమానులు, పోలీసుల మధ్య ఘర్షణలు జరిగి పాకిస్థాన్ అగ్ని గుండమైంది. ఇవ్వాళ ఇమ్రాన్ అరెస్ట్ తో మళ్లీ అగ్ని గుండమైంది.