ఢిల్లీ సర్కార్ కు సుప్రీం చీవాట్లు..25 వేల జరిమాన
posted on Oct 3, 2016 @ 3:37PM
దేశ రాజధాని ఢిల్లీలో డెంగ్యూ, చికెన్ గున్యా వ్యాధులు విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యాధుల వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు కూడా. అయితే దీనిపై పలువురు ఢిల్లీ ప్రభుత్వంపై.. కేజ్రీవాల్ పై విమర్శలు గుప్పించారు. దీనికి కేజ్రీవాల్.. మాకు అలాంటి అధికారాలు లేవు మోడీని అడగండి అంటూ ట్విట్టర్లో ట్వీట్స్ కూడా చేశారు కూడా. ఇదిలా ఉండగా ఇప్పుడు కేజ్రీవాల్ సర్కారు చూపిస్తోన్న తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ సర్కారు కనబరుస్తోన్న నిర్లక్ష్యంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఇటీవలే ఈ అంశంపై తమకు నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఉత్తర్వులను కూడా నిర్లక్ష్యం చేసింది. దీంతో కోర్టు ఉత్తర్వులను ధిక్కరించినందుకు గానూ ఢిల్లీ ప్రభుత్వానికి రూ.25 వేల జరిమాన విధిస్తున్నట్లు తాజాగా పేర్కొంది.