సుప్రీంకోర్టుకు బాంబు బెదిరింపు లేఖ
posted on Aug 18, 2015 @ 11:41AM
సుప్రీంకోర్టును బాంబులు పెట్టి పేల్చేస్తామని బెందిరింపులు రావడంతో కోర్టు చుట్టూ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలియని ఒక ఈ మెయిల్ ఐడి నుండి ఈ బెదిరింపు లేఖ వచ్చిందని.. దీంతో సుప్రీంకోర్టులోకి వచ్చేవారిని.. వెళ్లేవారిని క్షుణ్ణంగా పరిశీలుస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. ఒక్క న్యాయమూర్తులను తప్ప మిగిలిన న్యాయవాదులతో సహా అందరినీ పరిశీలిస్తున్నామని.. అంతేకాదు ఈ మెయిల్ ఎక్కడినుండి వచ్చిందో అని కూడా ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
అయితే యాకుబ్ మెమెన్ ఉరిశిక్ష విధించిన నేపథ్యంలో ఈ బెదిరింపు లేఖ వచ్చిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసు వ్యవహారంలో కొద్దిరోజుల క్రితం న్యాయమూర్తి దిపక్ మిశ్రాకు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆయనకు బులెట్ ఫ్రూఫ్ కారుతో పాటు ఇంటి చుట్టూ గట్టి భద్రతను కూడా ఏర్పాటు చేశారు. అయితే దీనిలో భాగంగానే సుప్రీంకోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చినట్టు భావిస్తున్నారు. ఎందుకంటే యాకూబ్ మెమెన్ కేసులో తీర్పు నిమిత్తం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్. దత్తు త్రిసభ్య బెంచ్ ఏర్పాటు చేశారు. దీనిలో జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ప్రఫుల్లా సి. పంత్, జస్టిస్ అమితావ్ రాయ్ ఉండగా వీరు ముగ్గురు అర్దరాత్రి సుప్రీం కోర్టులో యాకుబ్ క్షమాభిక్ష పిటిషన్ పై చర్చించి ఆ ఆర్జీని తిరస్కరించి ఉరి శిక్ష అమలు చేశారు. ఈనేపథ్యంలోనే సుప్రీంకోర్టుకు బెదిరింపులు వచ్చినట్టు తెలుపుతున్నారు.