వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు
posted on Feb 27, 2023 @ 4:50PM
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు జరుగుతున్న సమయంలో బెయిల్ ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది.
నిందితుల స్వేచ్ఛ కంటే సాక్షుల భద్రత, పాదర్శక దర్యాప్తు ముఖ్యమని ధర్మాసనం పేర్కొంది. కాగా ఈ కేసులో రిమాండ్‌లో ఉన్న వై.సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్‌పై వివేకా సతీమణి సౌభాగ్యమ్య దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్ ను హైకోర్టు అనుమతించిన సంగతి విదితమే.
ఈ బెయిలు పిటిషన్ విచారణ సందర్భంగా వివేకా హత్య కేసు దర్యాప్తు కీలకదశకు చేరుకుందని, ఈ కేసులో రాజకీయ పెద్దల ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోందని ఈ పరిస్థితుల్లో సునీల్ యాదవ్ కు బెయిలు ఇస్తే సాక్షులను ఆయన ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ పేర్కొంది. సీబీఐ వాదనలను పరగణనలోనికి తీసుకున్న హైకోర్టు సునీల్ యాదవ్ బెయిలు పిటిషన్ ను కొట్టివేసింది.