ఏపీ ప్రజలు రేపటి నుంచి జాగ్రత్తగా ఉండాలి
posted on May 21, 2020 @ 11:22AM
ఏపీ ప్రజలు రేపటి నుంచి జాగ్రత్తగా ఉండాలని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకూ రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, వడగాల్పుల ముప్పు కూడా ఉందని తెలిపింది. ముఖ్యంగా రాయలసీమ, కోస్తాంధ్రలో ఎండలు భగ్గుమంటాయని హెచ్చరించింది.
ఇక గుంటూరు జిల్లాలోని రెంటచింతలలో మూడు రోజులుగా 45 నుంచి 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుధవారం 47.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. బుధవారం రాష్ట్రంలో పలుచోట్ల 42-43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని.. రేపటి నుంచి ఆదివారం వరకు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమ, యానాంలలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ తెలిపింది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది. నీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీరు లాంటివి ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.