ఠారెత్తిస్తున్న ఎండలు
posted on Mar 26, 2025 @ 4:56PM
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మార్చి 3వ వారంలోనే తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు మించి నమోదౌతున్నాయి. ఎండకు తోడు వడగాల్పులు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడి ప్రతాపానికి ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావాలంటేనే జంకుతున్న పరిస్థితి ఉంది.
ముఖ్యంగా ఆంధ్రప్రదేద్ లో ఎండ తీవ్రత దడపుట్టిస్తోంది. ఈ పరిస్థితుల్లో తాజాగా వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరిక ప్రజలను మరింత భయపెడుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధ, గురువారాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అత్యవసరమైతే తప్ప ఎండ వేళల్లో బయటకు రావద్దని ప్రజలకు సూచించింది. అనివార్యంగా బయటకు రావలసి వస్తే తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.