ఉందిలే మండేకాలం..
posted on Mar 25, 2021 @ 3:50PM
వర్షాకాలం, చలికాలం అయితే తట్టుకోవచ్చు గానీ , ఎండాకాలం వచ్చిందంటే బయటికి వెళ్లాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాం. ప్రజల్లో సంవత్సరంలో ఎప్పుడు లేని ఆందోళన ఎండాకాలంలో మొదలవుతుంది. ఏ మార్చిలో అయినా కొంచం సుర్రు మనిపించే ఎండ.. ఈ మార్చు స్టార్టింగ్లో కొంచం బుంగమూతి పెట్టిన బుట్టబొమ్మలా ఉన్న. బుంగమూతి వదిలి శివాంగి వేషం వేస్తూ చమటలు పట్టిస్తోంది. మార్చి భానుడు మనపై ఎండ బాణం సంధిస్తుంటే.. ఇక ఏప్రిల్, మే నెలల గురించి తలుచుకుంటే చలి జ్వరం పుడుతుంది. ఇంజన్, మెటీరాలజికల్ డిపార్టుమెంట్ ఎసెస్మేషన్ ప్రకారం గతంతో పోలిస్తే ఈసారి దేశం మొత్తం ఎండలు భారీగా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. ఓ వైపు కరోనా, మరో వైపు బయటికి వెళ్లకపోతే నడవని బతుకు బండి, మరోవైపు ఈ మూడు నెలలు మనతో ఉండే మండే ఎండ. ఏం చేయాలో అర్థం కాక ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
ఈసారి తెలుగు రాష్ట్రాల్లో సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు సమాచారం. గత ఏడాదితో పోలిస్తే 0.71 నుంచి ఒక డిగ్రీ ఎక్కువగా ఉండనున్నాయని ఐఎండీ తెలిపింది. ఈసారి ఎండలతోపాటు వేడి గాలుల ప్రభావం చాల ఎక్కువగా ఉంటుందని సమాచారం. కోర్ హీట్ వేవ్ జోన్‌గా పిలిచే ప్రాంతాల్లో ఎక్కువగా వడగాల్పులు వీస్తాయని తెలియవచ్చింది.
ఆఫీస్ కి వెళ్లే వాళ్ళు అయితే కొంచం పర్లేదు. చక్కగా ఏసీలో కూర్చుని వర్క్ చేసుకుంటారు. రోడ్డు మీద ఉన్న వ్యాపారుల పరిస్థితి ఆలోచిస్తే మరి దారుణంగా ఉంటుందని చెప్పాలి. ఏదేమైనా ఎండ కాలం వెళ్లే వరకు కొంచం జాగ్రత్తగా ఉండండి.