సుమిత్రా మహాజన్ కు కూడా కోపం తెప్పించారు... సెలవు పెట్టి వెళ్లండి
posted on Dec 9, 2016 @ 3:45PM
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఇంకా మూడు రోజులు మాత్రమే జరగనున్నాయి. ఇప్పటి వరకూ జరిగిన సమావేశాల్లో పెద్ద నోట్ల రద్దుపై ఆందోళనలు తప్ప ఎలాంటి చర్చలు జరగలేదు. ఇప్పటికే ప్రతిపక్ష నేతలు సభల్లో చేస్తున్న ఆందోళనలకు పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఎల్‌కే అద్వానీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సైతం ఎంపీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఈరోజు కూడా సభ అలానే జరిగింది. దీంతో ఈరోజు స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు సభ మొదలైనప్పటి నుంచీ నోట్ల రద్దుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూనే ఉన్నారు. అయినా స్పీకర్ జోరో హవర్ నిర్వహించడంతో సభ్యులు మరింత గట్టిగా నినాదాలు చేశారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన స్పీకర్ సుమిత్రా మహాజన్.. జావ్ సబ్ చుట్టీ పర్ ( అందరూ సెలవు పెట్టి వెళ్లండి) అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. సభను బుధవారానికి వాయిదా వేశారు. మరి ఆఖరి మూడు రోజులైనా సభ సజావుగా సాగుతుందా..? లేక ఇలానే కొనసాగుతుందా..?చూడాలి.