వైద్య విద్యార్ధినుల ఆత్మహత్య
posted on Jan 24, 2016 @ 3:36PM
తమిళనాడులో ముగ్గురు వైద్య విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్నారు..విల్లుపురంలోని ఎస్‌వీఎస్ యోగా, నేచురోపతి మెడికల్ కాలేజీ సమీపంలో ఒక బావిలో విద్యార్థినుల మృతదేహాలు లభ్యమయ్యాయి.వారిని శరణ్య, ప్రియాంక, మనీషాలుగా గుర్తించారు. విద్యార్థినులు చనిపోయే ముందు ఆత్మహత్య లేఖ రాసినట్లు పోలీసులు వెల్లడించారు. కళాశాలలో కనీస వసతుల కోసం యాజమాన్యంతో పోరాడామని, కానీ వారి వేధింపులు తమపైన ఎక్కువయ్యాయని లేఖలో పేర్కొన్నారు.
కళాశాల యాజమాన్యం వేధింపుల వల్లే విద్యార్థినులు చనిపోయినట్లు వారి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు..కొన్ని రోజుల క్రితమే తీవ్ర సంచలనం రేపిన రోహిత్ వేముల ఆత్మహత్య గురించి మరువక ముందే, తమిళనాడులో ముగ్గురు స్టూడెంట్స్ ఆత్మహత్యకు పాల్పడటం, తీవ్ర చర్చనీయాంశంగా మారింది.