15 ఏళ్ల బాలికపై అత్యాచారం..వీడియో వాట్సాప్‌లో
posted on Jul 1, 2016 @ 4:52PM
దేశ అత్యాచారాల రాజధాని ఉత్తరప్రదేశ్‌లో ఆడవారిపై అత్యాచారాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. తాజాగా ఆగ్రాలో మరో దారుణం జరిగింది. విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన స్కూల్ డైరెక్టరే కామాంధుడిగా మారాడు. జితేందర్ సింగ్ యాదవ్ అనే వ్యక్తి ఓ 15 ఏళ్ల బాలికను తాను చెప్పినట్టు వినకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరించి లోబర్చుకున్నాడు. ఆమె బతిమాలినా వినకుండా బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దాంతో ఆ కామాంధుడికి తృప్తి కలగలేదు..ఆమెతో గడిపిన వీడియోను వాట్సాప్‌లో పోస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందాడు. దాదాపు సంవత్సరం నుంచి తనను బలవంతంగా అనుభవిస్తున్నాడని..తాను చెప్పినట్లు రాకపోతే వీడియోను నెట్‌లో పెడతానని బెదిరించేవాడని బాలిక ఆవేదన వ్యక్తం చేసింది. ఆ కామాంధుడి వలలో 20 మందికి పైగా అమ్మాయిలు చిక్కుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం ఆ దుర్మార్గుడు పరారీలో ఉన్నాడు.