ఇది మంచికా.. చెడుకా..!
posted on Sep 27, 2012 8:39AM
మనిషిలో అలసత్వం వుంటే అది అతన్నే బాధపెడుతుంది. కాని ప్రభుత్వాలకు, పాలకులకు, సంస్థలకు అలసత్వం ఉంటే అది జాతినేకాదు, దేశాన్ని కూడా బాధపెడుతుంది. అందరూ భారతదేశంవైపు చూస్తుంటే... భారతదేశం విదేశాల వైపు చూస్తుంటుంది. ఇటీవల భారతదేశంలోకి పిల్లల ఆటబొమ్మలు మొదలు ఎన్నో చైనా వస్తువులు భారతదేశ మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. వాటి తాకిడికి ఎంతోమంది చిన్నవ్యాపారులు ఆర్థిక ఇబ్బందులు కూడా పడ్డారు. ఇప్పుడు కొత్తగా శవపేటికలను దిగుమతి చేస్తోంది. కేరళ అలప్పౌజా జిల్లాకు చెందిన ఓ కంపెనీ చైనాలోని షాంఘైకి చెందిన ఓ శవసేటికల తయారీ సంస్థతో ఒప్పందం చేసుకుంది. దానికనుగుణంగా ‘స్వర్గపెట్టె’ అని పిలిచే 170 శవపేటికలు కేరళకు వచ్చాయి. ఈ శవపేటికలను పౌలోనియా అనే చెట్టు కలపతో తయారుచేయడం వల్ల గట్టిగా, పర్యావరణానికి అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు దీన్ని దిగుమతి చేసుకున్న కంపెనీ యాజమాని. ఇప్పటికే అలవాట్లతో సహా ఎన్నో విదేశాల నుండి ఎగుమతులు చేసుకుంటుంటే..... మనిషి ఎంతో ప్రధానమైన చావు, పుట్టుకల్లో పుట్టినరోజు వేడుకల్లో ఇప్పటికే పలు విదేశీ వస్తువులు దర్శనమిస్తుంటే చివరకు మరణానికి సంబంధించి విషయాల్లో కూడా విదేశీ వాడకాన్ని వదలలేకపోవడం మంచికో.. చెడుకో..!