తల్లి-కొడుకు మధ్య అక్రమసంబంధం
posted on Mar 4, 2020 @ 9:48AM
మొదటి భార్య కుమారుడు రెండో భార్య మధ్య ఏర్పడిన అక్రమ సంబంధమే దామూ నాయక్ ను బలి తీసుకుంది!
కర్ణాటక లోని విజయపురా జిల్లాలోని బసవన బాగేవాడిలో గల మడివాళేశ్వర గ్రూప్ విద్యాసంస్ధల అధినేత దామూ నాయక్ ను ఫిబ్రవరి 25న హంతుకులు గొంతుకోసి హత్య చేశారు.
పోలీసు యంత్రాంగం ఈ ఘటనపై ప్రత్యేక దృష్టి పెట్టి మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించింది.
ఈ హత్య వెనుక శత్రువుల పాతకక్షలు ఉండొచ్చని పోలీసులు అనుమానించారు. ఆ కోణంలో దర్యాప్తు కొనసాగించారు. ఆయనతో శతృత్వం ఉన్న వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. కానీ పోలీసులకి ఎటువంటి క్లూ దొరకలేదు.
దామూ నాయక్ కు కోట్లాది రూపాయల ఆస్తి ఉంది. అయితే అయన రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఈ కేసును ఆ యాంగిల్‌లో దర్యాప్తు చేయడంతో అసలు నిజం బయటపడింది.
సెల్ ఫోన్ కాల్ లిస్టు ఆధారంగా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దాము నాయక్ మొదటి భార్య కుమారుడు సుభాష్ నాయక్.. రెండో భార్య ప్రేమా మధ్య ఏర్పడిన అక్రమ సంబంధమే ఈ దారుణ హత్యకు కారణమని తెలిసింది.
దాము నాయక్ ను అడ్డు తొలగించుకుంటే.. కోట్లాది రూపాయల ఆస్తి తమ వశం అవుతుందని నిందితులు భావించారు.
వెంటనే తమ ప్లాన్ అమలు చేశారు. దామూ నాయక్ ను హత్య చేయడానికి ముగ్గురు వ్యక్తులకు సుపారీ ఇచ్చినట్లు పోలీసు విచారణలో తేలింది.
ప్రధాన నిందితులైన రెండోభార్యను మొదటి భార్య కొడుకుతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.