టి.బిల్లుకు చెక్ పెడతారా?

 

 

 

దాదాపు రెండు నెలల తర్వాత రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కాబోతోంది. డిసెంబర్ మూడున రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో శాసనసభ సమావేశలపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రపతి నుంచి తెలంగాణ బిల్లు వచ్చె వరకూ ఆగకుండా ముందుగానే శాసనసభ సమావేశపరచాలని కిరణ్ వర్గం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

 

కొంతమంది ముందుగానే సమైక్యం తీర్మానం చేయాలని అంటున్నారు. సాధారణ సమావేశాలు జరుగుతూ ఉంటే అవి ముందు బిఎసిలో ఖరారు చేసిన ఎజెండా ప్రకారమే నిర్వహించవల్సి ఉంటుంది. అప్పుడు తెలంగాణ ముసాయిదా బిల్లు రాష్ట్రపతి నుంచి గవర్నర్ చేతులు మీదగా వచ్చినా వాయిదా పడుతుంది. అందుకే రాష్ట్రపతి నుంచి బిల్లు రాకముందే శాసనసభ సమావేశాలు నిర్వహించి బిల్లుకు చెక్ పెట్టాలని కిరణ్ వర్గం ఆలోచన. 



అయితే ఈ వాదనలు ఆచరణకు సాధ్యమయ్యేవి కాదని సీమాంద్రకు చెందిన పలువురు సీనియర్ మంత్రులు కొట్టిపారేస్తున్నారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇలాంటి వాటితే పెద్దగా ఉపయోగం ఉండదని, రాష్ట్రపతి బిల్లు పంపాక దానిని వ్యతిరేకించడమే సరైన నిర్ణయ౦ అని భావిస్తున్నట్లు తెలుస్తోంది.