త్వరలో హైదరాబాద్‌లో శ్రీ వెంకటేశ్వర వైభోత్సవాలు
posted on Sep 19, 2022 @ 12:01PM
ఏడుకొండలు ఎక్కి వెంకటేశ్వరుని సన్నిధిలో కొంతసమయమైనా గడపాలని భక్తజనకోటి ఆశ. అంతే కాదు వెంకటేశ్వరుని ప్రత్యేక ఉత్సవాల్లో పాల్గొని తరించాలనీ అనుకుంటారు. కానీ ఆ అదృష్టం అంద రికీ దక్కదు. కానీ భక్తులు ఏమాత్రం చింతించనవసరం లేదని భగవంతుడే భక్తుల కోరికను తీర్చ నున్నాడు. త్వరలో ఏకంగా ఆనందనిలయమే తరలిరానున్నది.
తెలంగాణా ప్రజలు చాలాకాలంనుంచి ఎంతగానో ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. గత ఆరేళ్ల నిరీక్షణ త్వరలో తీరనుంది. అక్టోబర్ 11 నుంచి 15 వరకూ శ్రీ వెంకటేశ్వర వైభోత్సవాల పేర తిరుమ లలో శ్రీనివాసునికి జరిగే నిత్య కైంకర్యాలు హైదరాబాద్ ప్రజలకు వీక్షింపచేయడానికి టీటీడీ వారు సిద్ధమ య్యారు. ఇక సుప్రభాత సేవ నుంచి పవళింపు సేవ వరకు అందరూ కనులారా తిలకించవచ్చు. భాగ్య నగరం గోవిందా నామస్మరణతో మారుమోగనుంది.
ఎన్టీఆర్ స్టేడియం అనగానే దీపోత్సవాలు, రెండు తెలుగు రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాల నుంచి మహా భక్తులు, ప్రచారకులు వచ్చి అద్భుత కార్యక్రమాలు నిర్వహించడం, ప్రసంగాలతో భక్తులను తరింప జేయడమే మనం ఇన్నాళ్లూ గమనించాం. ఇపుడు ఏకంగా ఆనందనిలయాన్ని దర్శించుకోబోతు న్నా ము. తిరుమల శ్రీవారి ఆనంద నిలయాన్ని మన హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఎన్టీఆర్ స్టేడియం లో చూడవచ్చు. ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఆనంద నిలయంలో (నమూనా ఆలయం)లో టీటీడీ అర్చకులే స్వామివారికి నిత్య కైంకార్యాలు చేస్తారు, అందరికీ ఇష్టమైన తిరుపతి లడ్లు, ఇతర స్వామివారి ప్రసాదాలు అందజేస్తారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే.
ఏ మా భాగ్యం. మనం ఏడుకొండలు ఎక్కి రాలేమనో శ్రీవారే మన కోసం హైదరాబాద్ నడిబొడ్డునకు వచ్చి, తనకు నిత్యం ఆనంద నిలయంలో జరిగే కైంకర్యాలు, ఇక్కడే అందుకొని మనల్ని పరవశింప చేయనున్నారు. ఇక సరిగ్గా నెలరోజులే. ఇటువంటి మహా కార్యక్రమం నిర్వహిస్తున్న మహాభక్తులు, దాత లు భక్తజనకోటితో పాటు భగవంతుడి ఆశీస్సులు అందుకోనున్నారు.