స్పీడ్ న్యూస్ 3
posted on Jul 20, 2023 @ 4:04PM
నీట మునిగిన అండర్ పాస్
31. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ లింగంపల్లి రైల్వే అండర్‌పాస్ కిందకు భారీగా నీరు చేరింది. మోకాళ్ల లోతు వరకు నీరు చేరుకోవడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. వర్షం పడితే వరదనీటితో లింగంపల్లి అండర్‌పాస్ రోడ్డు ముంపునకు గురికావడం పరిపాటి అయ్యింది.
.........................................................................................................................................................
జగన్ పై చెక్ బౌన్స్ కేసు
32. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై చెక్‌బౌన్స్ కేసు పెడతామని తెదేపా నేత బీటెక్ రవి అన్నారు. బటన్ నొక్కి డబ్బులు జమచేశామని స్వయంగా సీఎం చెప్పినా ఇప్పటి వరకూ సగం మంది మహిళల ఖాతాలలో అమ్మ ఒడి డబ్బులు జమ కాలేదని ఆయన ఆరోపించారు.
...............................................................................................................................................................
వర్షాలపై సీఎస్ శాంత కుమారి సమీక్ష
33. తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీవర్షాల నేపథ్యంలో సచివాలయంలో ఉన్నతాధికారులతో సీఎస్ శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. ఎటువంటి పరిస్థితి ఎదురైనా తట్టుకునేందుకు సర్వ సన్నద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. విపత్తు దళాలను అప్రమత్తం చేయాలన్నారు.
.......................................................................................................................................................
కాళేశ్వరం వద్ద పెరిగిన ప్రవాహం
34. భారీ వర్షాల కారణంగా కాళేశ్వరం వద్ద ప్రవాహం పెరుగుతోంది. 33 అడుగులు మేర నీటిమట్టం నమోదైంది. అన్నారం సరస్వతి బ్యారేజి 15 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరులో గోదావరి నది ప్రవాహ ఉధృతి పెరిగింది.
...............................................................................................................................................................
రాయగఢ్ లో మట్లిపెళ్లలు విరిగిపడి 15 మంది మృతి
35. భారీ వర్షాల కారణంగా మహారాష్ట్రలోని రాయ్‌గడ్ జిల్లాలో మట్టిపెళ్లలు విరిగిపడి కనీసం 15 మంది మరణించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ధృవీకరించారు. పలువురు గల్లంతైనట్లు చెబుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.
......................................................................................................................................................
మణిపూర్ హింసాకాండపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం
36.మణిపుర్‌లో హింసాత్మక ఘటనలపై లోక్‌సభలో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. సభా కార్యకలాపాలు వాయిదా వేసి మణిపుర్ ఘటనలపై చర్చించాలని వాయిదా తీర్మానంలో బీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.
.........................................................................................................................................................
గండిపోచమ్మ ఆలయం వద్దకు వరద నీరు
37. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం గండి పోచమ్మ అమ్మవారి ఆలయం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. గండి పోచమ్మ అమ్మవారి ఆలయం గోపురం వరకూ వరద వరద నీరు చేరడంతో అధికారులు పాపికొండల విహారయాత్రను నిలిపివేశారు.
............................................................................................................................................................
పోలవరం వద్ద పెరిగిన గోదావరి నీటి మట్టం
38. పోలవరం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. 48 గేట్ల ద్వారా 3,15,791 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
.....................................................................................................................................................
మహిళలపై లైంగిక వేధింపులు అనాగరికం
39. మణిపుర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనను తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్ లో చేశారు. జాతుల మధ్య ఘర్షణలతో మహిళలను లైంగిక వేధింపులకు గురిచేయడం అనాగరికమని పేర్కొన్నారు.
...............................................................................................................................................................
రాష్ట్రంలో ఓట్ల దొంగలు
.40. రాష్ట్రంలో ఓట్ల దొంగలు పడ్డారని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఏపీలో ఓటు దొంగలను చూస్తున్నామన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 15నుంచి 19 వార్డులకు చెందిన బూత్, యూనిట్, క్లస్టర్ ఇన్‌చార్జిలకు సమీకృత శిక్షణ కార్యక్రంలో ఆయన మాట్లాడారు.
.............................................................................................................................................................
డబుల్ ఇళ్లపై అనవసర రాద్ధాంతం: తలసాని
41. డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంపై బీజేపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి తలసాని విమర్శించారు. కిషన్ రెడ్డిని పోలీసులు అడ్డుకోవడం, ఆయన రోడ్డుపై బైఠాయించడంపై స్పందించిన ఆయన కిషన్ రెడ్డి కోరితే తానే స్వయంగా తీసుకెళ్లి డబుల్ ఇళ్లను చూపిస్తానన్నారు.
..........................................................................................................................................................
ఆలస్యంగా ప్రకటించినందుకు ప్రత్యేక ధన్యావాదాలు!
42. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవు ప్రకటించడం వివాదాస్పదమైంది. తమ పిల్లలను స్కూల్స్, కాలేజీలకు పంపించిన తర్వాత సెలవు ప్రకటించడంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.
....................................................................................................................................................
నడ్డాతో పవన్ భేటీ
43. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో జనసేనాని పవన్ కల్యాణ్ నేడు భేటీ అయ్యారు. వీరి మధ్య భేటీ దాదాపు గంటసేపు జరిగింది. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై వీరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.
........................................................................................................................................................
నో క్యాస్ట్ ఆప్షన్ మస్ట్
44. విద్య సహా అన్ని దరఖాస్తుల్లో ‘నో క్యాస్ట్’, ‘నో రిలీజియన్’ అనే కాలమ్‌ను తప్పని సరి అని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. కులాన్ని, మతాన్ని వదులుకునే హక్కు అందరికీ ఉంటుందని, ఆ స్వేచ్ఛను అడ్డుకోవడం సరికాదని ఒక పిటీషన్ విచారించిన కోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
.............................................................................................................................................................
ట్రాఫిక్ డీసీలేం చేస్తున్నారు: డింపుల్ హాయత్
45. గత రెండు రోజులుగా వర్షాల కారణంగా నగరంలో ట్రాపిక్ జామ్ లు జరుగుతుంటే ట్రాఫిక్ డీసీపీలు ఎక్కడ ఉన్నారంటూ నటి హాయతి ట్వీట్ చేసింది. ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే, నటి డింపుల్ హయతి మధ్య గతంలో జరిగిన వివాదం నేపథ్యంలో ఈ ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది.
.........................................................................................................................................................
ఆర్ఆర్ఆర్ పై విశాఖ ఎంపీ దూషణలు
46. పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో వైసీపీ ఎంపీ ఎంవీవీ ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజుపై తన కుటుంబ సభ్యుల కిడ్నాప్ వ్యవహారంపై స్పీకర్, హోం మంత్రిత్వ శాఖకు రఘురామ లేఖ రాయడంపై ఎంవీవీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసభ్య పదజాలంతో దూషించారు.
.........................................................................................................................................................
బీజేపీ నేతల అరెస్టు పై లక్ష్మణ్ మండిపాటు
47. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సహా బీజేపీ ముఖ్య నాయకులను అరెస్ట్ పై ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించడం యుద్ధం అనుకుంటున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
..........................................................................................................................................................
సోనియాకు మోడీ పలకరింపు
48. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని ఆమె ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజు ఆమె కూర్చున్న చోటుకు వెళ్లి, ఆమె ఆరోగ్యం, క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు.
.........................................................................................................................................................
ఆన్ లైన్ క్రీడలపై నిషేధ చట్టం హక్కు రాష్ట్రాలకు లేదు!
49. ఆన్‌లైన్ క్రీడలను నిషేధిస్తూ చట్టం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని కేంద్రం మద్రాసు హైకోర్టుకు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్‌లైన్ క్రీడల నిషేధ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మద్రాసు హైకోర్టులో దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా కేంద్రం ఈ విషయం తెలిపింది.
...............................................................................................................................................................
అజిత్ పవార్ తో ఉద్ధవ్ ఠాక్రే భేటీ
50.ఎన్సీపీ తిరుగుబాట వర్గం నేత అజిత్ పవార్‌తో మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే బుధవారం భేటీ అయ్యారు. బెంగళూరు వేదికగా మంగళవారం జరిగిన విపక్షాల సమావేశంలో పాల్గొన్న ఉద్ధవ్ ఠాక్రే.. ఆ మరుసటి రోజే అజిత్ పవార్‌ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.