speed news
posted on Jun 27, 2023 @ 3:32PM
1.బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కుమార్తె తుల్జా భవానీపై రాజుభాయ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తన తండ్రే రాజు భాయ్ తో తనపై కేసు పెట్టించారని భవాని ఆరోపిస్తున్నారు.
2. ఇకపై అమెరికాలోని న్యూయార్క్‌లోనూ పాఠశాలలకు దీపావళి సెలవు ఇవ్వనున్నట్లు నగర మేయర్ ప్రకటించారు. అయితే ఈ సెలవు వచ్చే ఏడాది నుంచి అమలులోకి వస్తుంది.
3. జనసేన పార్టీ అధికారిక యూట్యూబ్ ఛానల్ చ10 లక్షల మంది సబ్ స్క్రైబర్లను సాధించింది. ఈ విషయాన్ని జనసేన అధికారికంగా ప్రకటించింది.
4.తెలంగాణ కాంగ్రెస్ లో ఓ వైపు జోష్, మరో వైపు అసమ్మతి సమాంతరంగా కనిపిస్తున్నాయి. తాజాగా పార్టీ వ్యవహారాలలో అనేక లోపాలు ఉన్నాయని, వాటి గురించి రాహుల్ కు చెబుతాననీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.
5. విశాఖ వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడు కిడ్నాప్ ఉదంతంతో మంత్రి అమర్నాథ్ కు చెమటలు పడుతున్నాయి. ఆయన తాజాగా గన్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
6. నైరుతి రుతుపవనాల ఆలస్యం, వర్షాభావ పరిస్థితుల కారణంగా టమాటా ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. కిలో టమాటా వంద రూపాయలకు చేరువైంది. (టమాటా)
7. ఉత్తరప్రదేశ్ లో తుపాకీ పేలింది. డజనుకు పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గుఫ్రాన్ ఈ రోజు ఉదయం ఎన్‌కౌంటర్ హతమయ్యాడు. (ఎన్ కౌంటర్)
8. తెలంగాణ కాంగ్రెస్ లో నయా జోష్ కనిపిస్తోంది. పొంగులేటి, జూపల్లి సహా 35 మంది నేతలు నిన్న కాంగ్రెస్ కండువా కప్పుకోగా, ఈ రోజు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహంపై స్ట్రాటజీ మీటింగ్ జరిగింది.
9.తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పండరీపుర్ లోని విఠోభ రుక్మిణి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా రైతులు అంతా క్షేమంగా ఉండాలని ఆయన ప్రార్ధించారు.
10. రాజ్యసభ మాజీ సభ్యుడు సోలిపేట రామచంద్రారెడ్డి కన్నుమూశారు. ఆయన వయస్సు 92 సంవత్సరాలు. 70 ఏళ్ల పాటు రాజకీయాలలో క్రియాశీలంగా పనిచేసి మచ్చలేని నేతగా పేరుపొందిన రామచంద్రారెడ్డి మరణం పూడ్చలేని లోటని సీఎం కేసీఆర్ సంతాప సందేశంలో పేర్కొన్నారు.