సీఆర్డీఏ రద్దుకు అసెంబ్లీ ఆమోదం.. అన్యాయం చేస్తున్నారన్న స్పీకర్ తమ్మినేని!
posted on Jun 17, 2020 @ 4:35PM
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో పలు బిల్లులు శాసన సభలో ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదం తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుతో పాటుగా అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి, దేవాదాయ చట్టంలో రెండు సవరణ బిల్లులకు కూడా శాసనసభ ఆమోదం తెలిపింది. సీఆర్డీఏ రద్దు బిల్లును మంత్రి బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో పునఃప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు శాసన సభ ఆమోదం తెలిపింది. సీఆర్డీఏ రద్దు బిల్లును మరోసారి ఆమోదిస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. కాగా, బిల్లు పాస్ అయ్యాక స్పీకర్ తమ్మినేని తనలో తాను మాట్లాడుకున్న మాటలు.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బిల్ పాస్ అయ్యాక చిన్నగా తనలో తాను 'అన్యాయం చేస్తున్నారు, తప్పు చేస్తున్నారాయ్యా.' అని స్పీకర్ అన్న మాటలు మైక్ ద్వారా చిన్నగా వినిపించాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.