విమానంపై సోనూసూద్ ఫోటో..
posted on Mar 20, 2021 @ 2:57PM
సోనూసూద్ అంటే ఇండియాలో తెలియని వాళ్ళు ఉండరు. అరుంధతి సినిమాలో వదల బొమ్మాలి వదలా అంటూ నెగిటివ్ పాత్ర పోషించిన సోనూసూద్. నటుడిగా వచ్చి సేవకుడిగా మారి లాక్ డౌన్ లో ఎంతో మందికి సేవ చేసిన విషయం దేశ ప్రజలందరికి తెలిసిందే.. తన సేవకు గౌరవంగా దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ అరుదైన గౌరవం అందించింది. లాక్‌డౌన్ సమయంలో ఆయన చేసిన విశేషమైన సేవలకు గౌరవంగా స్పైస్ జెట్ బోయింగ్ 737 విమానం మీద సోనూసూద్ ఫొటో వేశారు. ‘ఆపద్బాంధవుడు సోనూసూద్‌కు సెల్యూట్’ అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. దేశీయ విమానయాన సంస్థ సొంత ఖర్చులతో ఒక వ్యక్తి గౌరవార్థంగా ఇలా చేయడం ఇదే తొలిసారి.
స్పైస్‌జెట్ నుంచి లభించిన ఈ గౌరవం పట్ల సోనూ ఆనందం వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉన్నవారికి తాను చేతనైనంత సాయం చేస్తూనే ఉంటానని తెలిపారు. మరోవైపు, లాక్‌డౌన్‌లో సోనూసూద్, స్పైస్‌జెట్ కలిసి విదేశాల్లో చిక్కుకున్న ఎంతో మంది భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.