సోనియమ్మ దయతలిచెన్... అపాయంట్మెంట్ ఇచ్చెన్...
posted on Dec 6, 2012 @ 12:53PM
గత అనేక నెలలుగా తెలంగాణా యం.పీ.లు, నేతలు అమ్మ సోనియమ్మ దర్శనం కోసం ఎంత ప్రాదేయపడినా ఒప్పుకోనీ ఆమె, ఈ రోజు వారు ఆడిగిందే తడువు వారికి అపాయంట్మెంట్ ఇవ్వడమే గాక వారితో దాదాపు గంటసేపు మాట్లాడటంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వారు అంత పొంగిపోతారని ముందే తెలుసుంటే, ఆమె ఆపని ఎప్పుడో చేసిదేమో! అప్పుడప్పుడు ఇలాగే వారికి దర్శనం గ్రాంట్ చేస్తుంటే వారుకూడా తే.రా.సా. వైపు చూడడం మానుకోనేవారేమో పాపం. ఎవరేవిదంగా కమ్మలుకడితేనేమి, మొత్తం మీద కధ సుఖాంతమయింది అదే పదివేలు అని హుషారుగా బయటకి వచ్చేరు తెలంగాణా యం.పీ.లు.
సోనియమ్మ యఫ్.డి.ఐ., రాబర్ట్ వాద్రా గొడవల్లోపడి తమ తెలంగాణా సంగతి మరిచిపోయిఉండవచ్చుననే ఆలోచనతో వారు మళ్లీ ఆమెకు ‘తెలంగాణా ఇవ్వడం ఎంత అవసరమో, ఇవ్వకపోతే ఏ అనర్దాలు జరుగవచ్చో పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ లాగ సవివరంగా గుర్తు చేసారు..ట! త్వరలో నిర్వహింపదలచిన అఖిల పార్టీ సమావేశం గురించి కూడా వారు చర్చినట్లు వార్త. ‘అఖిల పార్టీ సమావేశం’ ఈ సంవత్సరానికే ఒక గొప్ప పొలిటికల్ జోకు అని తే.రా.సా. నాయకులు, బి.జే.పి. నేతలు జోకులు పేలుస్తున్నా ‘ఇది చారిత్రాత్మక సంఘటన’ అని తెలంగాణా యం.పీ.లు అని గర్వంగా చెప్పుకొస్తున్నారు. అయితే, “ఇది మాపార్టీని దెబ్బతీసేందుకే కాంగ్రేసు మొదలుబెట్టిన కొత్త నాటకం” అని చంద్రబాబు సన్నాయి నొక్కులు నొక్కుతూనే “దానిని ఎలా డీల్ చేయాలో మాకు బాగా తెలుసు” అని తనకి తానూ దైర్యం చెప్పుకొంటూ, మనకూడా సవినయమగా తెలియజేసారు.