స్నేక్ గ్యాంగ్ నిందితులు దోషులే.. కోర్టు తుది తీర్పు
posted on May 10, 2016 @ 6:15PM
స్నేక్ గ్యాంగ్.. వీరు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. రెండేళ్ల క్రితం ఓ యువతిని పాముతో బెదిరించి.. ఆమెపై అత్యాచారం చేసిన ఘటన బయటకు రావడంతో అసలు కథంతా బయటకొచ్చింది. ఈ గ్యాంగ్ ఎప్పటినుండో ఇలాంటి ఘోరాలకు పాల్పడుతున్నట్టు.. దాదాపు ముప్పై మందిని పైగా ఇలానే బెదిరించి వారిపై అత్యాచారాలు చేసినట్టు వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ గ్యాంగ్ కేసులో నిందితులుగా ఉన్న వారిని రంగారెడ్డి జిల్లా కోర్టు దోషులుగా తెల్చుతూ తీర్పునిచ్చింది. నిందితులకు బుధవారం శిక్షలు ఖరారు కానున్నాయి.
ఈకేసులో ప్రధాన నిందితుడు ఫైసల్ దయాని(ఎర్రకుంట), ఖాదర్ బరాక్బ(ఉస్మాన్‌నగర్), తయ్యబ్ బసలమ(బండ్లగూడ,బార్కాస్), మహ్మద్ పర్వెజ్(షాయిన్‌నగర్), సయ్యద్ అన్వర్(షాయిన్‌నగర్), ఖాజా అహ్మద్ (ఉస్మాన్‌నగర్), మహ్మద్ ఇబ్రాహీం (షాయిన్‌నగర్), అలీ బరాక్బ (షాయిన్‌నగర్), సలాం హండీ (బిస్మిల్లాకాలనీ)లను నిందితులుగా ఉన్నారు. ప్రస్తుతం వీరిలో ఏడుగురు నిందితులు చర్లపల్లి కారాగారంలో విచారణ ఖైదీలుగా ఉండగా మిగతా ఇద్దరు బెయిల్‌పై బయటకు వచ్చారు