స్మృతీ ఇరానీ నయా వివాదం..
posted on Aug 18, 2016 @ 4:59PM
అలా శాఖ మారిందో లేదో అప్పుడే స్మృతీ ఇరానీ అప్పుడే కొత్త వివాదానికి హాయ్ చెప్పారు. ఇటీవలే క్యాబినెట్ మార్పుల్లో స్మతీ ఇరానీ శాఖ మారిన సంగతి తెలిసిందే. చేనేత శాఖ మంత్రిగా ఆమె బాధ్యతలు చేపట్టారు. ఆమె బాధ్యతులు చేపట్టి రెండు నెలలు కూడా కాకముందో మరో వివాదం ఏర్పడింది. అది కూడా సీనియర్ అధికారి.. ఆ శాఖ కార్యదర్శి రష్మీ వర్మతో. కేబినెట్ ఆమోదించిన 6వేల కోట్ల రూపాయల దుస్తులు, వస్త్రాలు ప్యాకేజీ, అక్టోబర్లో జరుగబోయే టెక్స్టైల్ సదస్సు విషయాలకు సంబంధించి స్మృతీ రష్మీతో విభేధించినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఇతర అధికారుల సమక్షంలోనే కార్యదర్శితో తీవ్ర వాగ్వాదానికి దిగినట్టు సమాచారం. ఇక విషయం తెలుసుకున్న పార్టీ పెద్దలు సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారట.
మరోవైపు దీనిపై స్పందించిన రష్మీ వర్మ మాత్రం.. స్మృతి ఇరానీతో వివాదాన్ని ఖండించారు. దీనిపై కామెంట్ చేయదలుచుకోలేదని, ఇవి మామూలు కమ్యూనికేషన్స్ మాత్రమేనని దాటవేశారు. మొత్తానికి శాఖ ఏదైనా కానీ.. స్మృతీ వివాదాలు మాత్రం కామన్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.