స్మృతీకి ఇది కూడా దక్కలేదా.. ఎందుకిలా..!
posted on Jul 16, 2016 @ 5:14PM
కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ప్రాధాన్యత రోజు రోజుకి తగ్గిపోతుందా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. ఎందుకంటే తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలానే అనిపిస్తుంది. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోడీ క్యాబినెట్ ప్రక్షాళన చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు అతి ప్రాధాన్యత కలిగిన మానవ వనరుల అభివృద్ధి శాఖ నుండి ఆమెను జౌళి శాఖను కేటాయించారు. దానికి స్మతీ ఇరానీపై ఈ మధ్య వచ్చిన ఆరోపణల నేపథ్యంలోనే ఆమెకు శాఖను మర్చేశారని వార్తలు వచ్చాయి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థుల గొడవ, దళిత విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య వివాదాలవల్లే స్మతీ ఇరానీ శాఖ మార్పుకు కారణాలు అని అన్నారు. అయితే ఇప్పుడు ఏమైందో తెలియదు కానీ పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ నుంచి కూడా ఆమెను తొలగించారు.
నేడు కేబినెట్ కమిటీల్లో మార్పులు, చేర్పులు జరగగా.. స్మృతికి అందులో చోటు దక్కలేదు. పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ నుంచి ఆమెను తొలగించారు. అయితే ఈసారి కూడా స్మృతీ స్థానంలో ప్రకాశ్ జవదేకర్ కే చోటు దక్కింది. మానవ వనరుల అభివృద్ధి శాఖకు కూడా మోడీ ప్రకాశ్ జవదేకర్ ను నియమించారు. ఇప్పుడు ఆరు కేబినెట్ కమిటీల్లో నేడు మార్పులు చేయగా.. ఇద్దరు సహాయమంత్రులు, మరికొందరు స్వతంత్ర మంత్రులకు కమిటీల్లో చోటు కల్పించగా.. స్మృతి ఇరానీ పేరు ఎక్కడా లేదు. స్మృతి స్థానంలో మళ్లీ మానవవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రకాశ్‌జవదేకర్‌ను పార్లమెంటరీ వ్యవహారాల కమిటీలోకి తీసుకున్నారు. మరి ఇంతలా మోడీ స్మృతీ ఇరానీకి ప్రాధాన్యత తగ్గించడానికి గల కారణాలు ఏంటో ఆయనకే తెలియాలి.