బార్బర్ షాపుకు వెళ్ళి కరోనాతో వచ్చాడు!
posted on Apr 27, 2020 @ 10:16AM
బార్బర్ షాపులకు కేంద్రం వెసులుబాటు ఇచ్చింది. అయితే కటింగ్ చేయించుకోవడానికి వెళ్లే ముందు ఒక సారి ఆలోచించుకొని వెళ్ళండి. ఎందుకంటే ఒకే టవల్ వాడి 12 మందికి కటింగ్ చేశాడట. అయితే అందులో ఆరుగురికి పాజిటివ్ తేలింది.
మధ్యప్రదేశ్ లోని ఖర్ గావ్ జిల్లాలోని బార్ గావ్ గ్రామంలో ఓ వ్యక్తి బార్బర్ షాప్ కు వెళ్లి కటింగ్,షేవింగ్ చేయించుకున్నాడు. అతనికి వాడిన టవల్ తోనే మరో 12 మందికి కటింగ్ షేవింగ్ చేశాడు. అయితే, మొదట కటింగ్ చేయించుకున్న వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అతని గురించి ఆరాతీయగా, బార్బర్ షాప్ కు వెళ్లిన విషయం చెప్పాడు. కటింగ్ షాప్ లో కటింగ్ చేయించుకున్న 12 మందికి టెస్టులు చేస్తే అందులో ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. ఈ 12 మందికి ఒకే టవల్ ను ఉపయోగించి కటింగ్ చేసినట్టు బార్బర్ షాప్ అతను చెప్పాడు. గ్రామంలో ఆరుగురికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆ గ్రామాన్ని రెడ్ జోన్ గా ప్రకటించి సరిహద్దులు మూసేశారు. ఇంటి నుంచి ఎవర్ని బయటకు రాకుండా పోలీసులు పహారా కాస్తున్నారు.
కరోనా వ్యాప్తికి కీలక పాత్ర పోషించిన వ్యక్తి అదే... కటింగ్ చేసిన వ్యక్తికి మాత్రం కరోనా నెగెటివ్ వచ్చింది. ఈ విషయాన్నే గ్రామస్థులు వింతగా చెప్పుకుంటున్నారట. ఒకరు వాడిన వస్తువులు మరొకరు వాడితే ఎలా వుంటోందో కటింగ్ షాప్ అద్దం పడుతోంది.