టెర్రర్ టెన్షన్..8మంది సిమీ ఉగ్రవాదులు పరార్..
posted on Oct 31, 2016 @ 10:16AM
బోపాల్ లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బోపాల్ జైలు నుండి 8మంది సిమీ ఉగ్రవాదులు తప్పించుకున్నారు. రాత్రి రెండు గంటల సమయంలో హెడ్ కానిస్టేబుల్ రమాశంకర్ గొంతును స్టీల్ ప్లేట్ తో కోసి ఉగ్రవాదులు తప్పించుకున్నట్టు తెలుస్తోంది. రమాశంకర్ ను హత్య చేసిన అనంతరం, బ్లాంకెట్స్ సహాయంతో ప్రహరీ గోడను ఎక్కి, జైలు నుంచి బయటపడ్డారు. పరార్ అయిన సిమీ ఉగ్రవాదుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ 8 మంది ఉగ్రవాదులను గతంలో ఒడిశాలో తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై మధ్యప్రదేశ్ హోంమంత్రి భూపేంద్ర సింగ్ మాట్లాడుతూ, జరిగిన ఘటనపై విచారణకు ఆదేశిస్తున్నట్టు తెలిపారు. మూడేళ్ల క్రితం కూడా ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్ లో జరిగింది. భోపాల్ కు 280 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖండ్వా జైలు నుంచి ఏడుగురు సిమీ ఉగ్రవాదులు తప్పించుకున్నారు అని చెప్పారు.