కొబ్బరి నీరు ఎక్కువగా తాగుతున్నారా.. ఈ జబ్బులు కొనితెచ్చుకున్నట్లే!
posted on Apr 28, 2023 @ 9:30AM
కొబ్బరి నీళ్లను ఆరోగ్యకరమైన పానీయాలలో ఒకటిగా పరిగణిస్తారు. వేసవి కాలంలో శరీరంలో తేమ శాతం మొత్తం కోల్పోతున్నప్పుడు తిరిగి శరీరాన్ని హైడ్రేట్ చేసే ఉద్దేశ్యంతో కొబ్బరి నీరు తాగుతూ ఉంటారు. రహదారుల పక్కన 30 నుండి 50 రూపాయలలోపు లభించే ఈ కొబ్బరి నీరు శీతల పానీయాలకంటే అద్భుతం, ఆరోగ్యం కూడా. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో సెలైన్ కొరత ఉన్న సమయంలో దీనిని IV డ్రిప్స్‌లో ఉపయోగించారనే విషయం తెలిస్తే కొబ్బరి నీరు ఎంత శక్తివంతమైందో అర్థం అవుతుంది. అయితే వేసవి తాపాన్ని అరికట్టాలని, వేసవికి చెక్ పెట్టాలని కొబ్బరి నీటిని అతిగా తాగితే మాత్రం కొంప కొల్లేరే అంటున్నారు వైద్యులు. అద్భుతమైన కొబ్బరి నీరు అనోరాగ్యాన్ని ఎలా తెచ్చిపెడుతుందో తెలుసుకుంటే..
కొబ్బరి నీటిలో పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది, ఇది శరీరంలోని ద్రవ స్థాయిలను సమతుల్యంగా ఉంచడానికి అవసరం. కానీ ఈ పొటాషియం ఎక్కువైతే.. హైపర్‌కలేమియా అనే పరిస్థితికి దారి తీస్తుంది, ఇందులో గుండె కండరాలు రక్తాన్ని కదల్చకుండా చాలా త్వరగా గడ్డకట్టేలా చేస్తుంది. . ఈ సమస్య కారణంగా నత్తిగా మాట్లాడటమనే సమస్య, ఇతర నాడీ సమస్యలు వస్తాయి. చాలా కాలం పాటు ఇది కొనసాగితే గుండె ఆగిపోయే ప్రమాదం ఉంటుంది.
కొబ్బరి నీళ్లలో సోడియం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, 1 కప్పు తాజా కొబ్బరి నీళ్లకు 252 మిల్లీగ్రాముల సోడియం ఉంటుంది. ఇది రోజువారీ తీసుకోవాల్సిన సోఫియం స్థాయిలో పవకు వంతు కంటే ఎక్కువ. ఇలా చూస్తే.. ఎక్కువ కొబ్బరి నీళ్లు తీసుకోవడం వల్ల సోడియం పెరిగి రక్తపోటు లేదా ఇతర సమస్యలు తెచ్చిపెడుతుంది. రోజు వారీ ఆహారంలో శరీరానికి సోడియం అందుతూ ఉంటుంది కాబట్టి కొబ్బరి నీరు మితంగా తీసుకోవాలి. ముఖ్యంగా రక్తపోటు ఉన్నవారు దీంతో జాగ్రత్తగా ఉండాలి.
అధిక బరువు ఉన్నవారు కేలరీలను బర్న్ చేయడంలో చాలా కష్టాలు పడుతుంటారు. కొబ్బరి నీరు తాగితే వెయిట్ లాస్ అవుతారనే ఒక నమ్మకం అందరిలో ఉంది. కానీ కొబ్బరి నీరు అధికంగా తీసుకుంటే ఇందులో కేలరీలు కూడా శరీరం మీద ప్రభావం చూపిస్తాయి. అనేక స్పోర్ట్స్ డ్రింక్స్, పండ్ల రసాలలో ఉన్నంత చక్కెర కొబ్బరి నీళ్లలో లేకపోయినా ఎక్కువ తీసుకుంటే బరువు పెంచగలిగేంత ప్రభావం చూపిస్తుంది.
మధుమేహం ఉన్నవారు కొబ్బరినీరు తీసుకునే విషయంలో తటపటాయిస్తుంటారు. తాగొచ్చనేది చాలామంది నమ్మకం. కొబ్బరి నీళ్లలో చక్కెర శాతం తక్కువగా ఉన్నప్పటికీ, ఇందులో కార్బోహైడ్రేట్లు, కేలరీలు బానే ఉంటాయి. బ్లడ్ షుగర్ ఉన్నవారు ప్రతిరోజూ కొబ్బరి నీళ్లను తీసుకోకూడదు. అలా కాదని రోజూ తీసుకుంటే షుగర్ లెవర్స్ పెరుగుతాయి.
కొబ్బరి నీళ్లలో సోడియం ఎక్కువగా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. సోడియం ఎక్కువగా ఉండటం వల్ల కొందరికి కొబ్బరి నీరు తీసుకున్నప్పుడు షాక్‌గా ఉంటుంది. అధిక రక్తపోటుతో బాధపడుతున్న వ్యక్తులు దీనిని తీసుకోకూడదు ఎందుకంటే ఇది రక్తపోటును పెంచుతుంది.
కాబట్టి కొబ్బరి నీరు ఎక్కువగా తాగే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి.
◆నిశ్శబ్ద.