గిప్టులంటేనే భయపడుతున్న సిద్ధరామయ్య..
posted on Oct 19, 2016 @ 11:05AM
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య ఈ మధ్య బహుమతులు తీసుకోవడానికి తెగ భయపడుతున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే... గతంలో ఆయన పెట్టుకున్న రిస్ట్ వాచ్ వల్ల వివాదం అంతా ఇంతా కాదు. బీజేపీ నేతలైతే ఏకంగా దీనిని పెద్ద ఇష్యూనే చేశారు. అంతేకాదు ఈ విషయం ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్ఠానం వరకు వెళ్లింది. అయితే ఏసీబీ క్లీన్ చిట్ ఇవ్వడంతో ఆయన దాన్నుంచి బయటపడ్డారు. పాపం ఆ అనుభవం వల్లనో ఏమో కానీ ఇప్పుడు సిద్దూ బహుమతులు తీసుకోవాలంటేనే కాస్త భయపడుతున్నారు. ఆ తరువాతం వెండి విగ్రహం బహుమతిగా ఇస్తానన్నా వద్దన్నారు. ఇప్పుడు తాజాగా తన మంత్రివర్గ సహచరుడు, పశుసంవర్ధక మంత్రి ఏ.మంజు విధానసౌధలో సిద్ధరామయ్యకు గిఫ్ట్ ఇవ్వబోయారు.ఆయన మాత్రం ఏ మాత్రం రెండో ఆలోచన లేకుండా వద్దని చెప్పేశారు. గిఫ్ట్ బాక్స్ లో కేవలం సిల్క్ జుబ్బాలు మాత్రమే ఉన్నాయని మంజు చెప్పినప్పటికీ... అలాంటివి తాను ధరించనంటూ సున్నితంగా తిరస్కరించారు. పాపం మొత్తానికి సిద్దూ గిఫ్ట్స్ విషయంలో బాగానే భయపడ్డారు.