నాగర్ కర్నూలులో దారుణం.. యువకులకు ఎస్ఐ శిరోముండనం
posted on Oct 19, 2024 @ 2:10PM
అహంకారం తలకెక్కి కొందరు పోలీసులు చేస్తున్న పనులు మొత్తం పోలీసు వ్యవస్థకే సిగ్గుచేటుగా పరిణమిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో జగన్ హయాంలో కొందరు పోలీసు అధికారులు వ్యవహరించిన తీరే ఇందుకు నిదర్శనం. యూనిఫారం ఉందన్న పొగరుతో కొందరు పోలీసు అధికారులు సభ్య సమాజం తలదించుకునే విధంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా నాగర్ కర్నూలులో ఓ ఎస్ఐ ముగ్గురు యువకులకు శిరోముండనం చేయించారు. వీరు చేసిన నేరమేదైనా ఉందా అంటే అది వారిలో ఒక యువకుడు ఎస్ ఐ ముందు తలదువ్వుకోవడమే.
ఇక వివరాలలోకి వెడితే.. నాగర్ కర్నులులో ముగ్గురు యువకులు పెట్రోలు పోయించుకునే విషయంలో స్థానిక పెట్రోల్ బంకు వద్ద ఘర్షణ పడ్డారు. సమాచారం అందుకున్న ఎస్సై జగన్ ఆ యువకులను అదుపులోనికి తీసుకుని పీఎస్ కు తీసుకు వచ్చారు. అక్కడ వారిని విచారిస్తుండగా.. వారిలో ఓ యువకుడు జేబులోంచి దువ్వెన తీసి తలదువ్వు కున్నాడు.దీంతో అనంతరం వారిని విచారిస్తుండగా ఓ యువకుడు ఎస్సై ముందు తల దువ్వుకు న్నాడు. దీంతో తన ముందే తల దువ్వుకుంటువా అంటూ ఆగ్రహంతో రగిలిపోయిన ఎస్సై ఆ ముగ్గురు యువకుకు శిరోముండనం చేయించారు.
ఈ ఘటనతో వారిలో ఓ యువకుడు తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తు తం ఆ యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. కాగా ఎస్ఐ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు సదరు ఎస్ఐపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు నిరసన కారులకు నచ్చచెప్పి, ఎస్ఐపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.