అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ ఇంటిపై కాల్పులు
posted on Jan 5, 2026 @ 5:07PM
అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీవాన్స్ ఇంటిపై కాల్పుల కలకలం రేపుతున్నాయి. ఒహియో రాష్ట్రం సిన్సినాటిలోని జేడీ వాన్స్ నివాసంపై అగంతకుడు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో జేడీ వాన్స్ ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. కాల్పులతో అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి. అయితే ఈ కాల్పులు జరిగిన సమయంలో జేడీవాన్స్ దంపతులు ఇంట్లో లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్, పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
జేడీవాన్స్ సెలవుల అనంతరం ఆదివారమే ఆయన వాషింగ్టన్ డీసీకి బయలుదేరి వెళ్లినట్లు తెలిసింది. అదుపులోకి తీసుకున్న వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించే ప్రయత్నం చేయలేదని ప్రాథమికంగా భావిస్తున్నారు. అతడు ఉపాధ్యక్షుడిని లక్ష్యంగా చేసుకుని ఈ చర్యకు పాల్పడ్డాడా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనపై వైట్ హౌస్ లేదా సీక్రెట్ సర్వీస్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు