మోడికి శివసేన ఝలక్..
posted on Jun 25, 2013 @ 1:01PM
కేదార్‌నాథ్ లో సంభవించిన విలయం దేశ రాజకీయాల్లో కీలక మార్పులకు కారణమవుతున్నాయి.. ముఖ్యంగా ఈ విషయంలో బాధితుల రక్షించడంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించిన తీరు మరింతగా వివాదాస్పదం అవుతుంది.. తాజాగా గుజరాత్ సియం నరేంద్రమోడి తీరుపై శివసేన తీవ్రంగా స్పందించింది.
విలయం సంభవించిన వెంటనే స్పందించిన మోడి తన రాష్ట్ర ప్రజలను రక్షించుకోవటాన్ని అందరూ ప్రశంసించిన కేవలం తన రాష్ట్ర ప్రజలను మాత్రమే కాపాడుకోవడం వివాదాస్పద మవుతుంది.. వరదల్లో చిక్కుకున్న తన రాష్ట్ర ప్రజలను కాపాడుకోవడానికి రెండు బోయింగ్ విమానాలతో పాటు, 30 బస్సులను ఏర్పాటు చేసి గంటల వ్యవదిలోన తన ప్రజలను కాపాడుకున్నాడు. కాని ఈ తీరే ఇప్పుడు వివాదాలకు కారణం అవుతుంది.
మోడిని దేశ నాయకుడిగా అందరూ భావిస్తున్న సమయంలో ఇలా కేవలం తన రాష్ట్ర ప్రజలను మాత్రమే కాపాడుకోవడాన్ని శివసేన తప్పుపట్టింది..ఈ విషయం మీదే మోడినీ తీవ్రస్థాయిలో విమర్శించింది.. పార్టీ అధికారికంగా ప్రచురించే పత్రిక సామ్నాలో మోడి తీరుపై పరుష పదజాలంతో విమర్శలు గుప్పించింది.
గతంలో మోడిని ఎన్నికల సారథిగా నియమించినప్పుడు పూర్తి స్ధాయిలో మద్దతు ప్రకటించిన శివసేన ఇప్పుడు మోడి తీరును తీవ్రంగా వ్యతిరేఖించింది