శిల్పారామానికి పొంచి ఉన్న ముప్పు?
posted on Jul 11, 2012 @ 10:43AM
హైదరాబాద్ లో దర్శించనీయ ప్రాంగణంగా పేరు తెచ్చుకున్న శిల్పారామం ముప్పు ఉందని నగరవాసులు కలవర పడుతున్నారు. ఈ నెల 30న తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ తలపెట్టిన మిలియన్ మార్చ్ పేరుతో తెలుగు వారికి ప్రాముఖ్యత గల ఈ ప్రాంతాన్ని ఎంచుకుని దీనిని కూలగొట్టాలని పథకం వేసినట్లు తెలుస్తుంది. ఇది సెలవుదినాలల్లో నగర పర్యాటకులను అలరించటమే కాక, ఆంద్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాలోనూ పేరెన్నిక గన్న అందమైన హస్తకళలను ప్రదర్శించే ప్రదేశంగా పేరుంది. అంతేకాకుండా నగరంలో జరిగే అనేక సాంస్కృతిక కార్యక్రమాలను ఇక్కడ నిర్వహిస్తుంటారు. శిల్పారామం అనేక దేశాలకు చెందిన ప్రముఖులను కూడ ఆకర్షించే పర్యాటక కేంద్రంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇంతకు ముందు ముష్కర మూకలు ట్యాంకుబండ్‌పై ఉన్న విగ్రహాలను విద్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ సారి హుస్సేన్ సాగర్ లో ఉన్న బుద్దవిగ్రహాన్ని, రవీంద్రభారతిని కూడా వీరు విధ్వంస కాండలో చేర్చినట్లు తెలుస్తుంది. దీన్ని నివారించే దశలో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని నగరవాసులు కోరుతున్నారు. ప్రాంతాల పేరుతో జరుగుతున్న ఈ వినాశనాన్ని ప్రతి ఒక్కరూ నిరసిస్తున్నారు.