ఖర్చు తెలుసుకోకుండానే రైల్వేస్టేషన్లలో కాయిన్‌వెండిరగ్ మిషన్లు?
posted on Jul 11, 2012 @ 10:52AM
రైల్వేస్టేషన్లలో తరుచుగా ఏర్పడే చిల్లరకొరత నివారించాల్సిందే కానీ, పరిష్కారంగా ఏర్పాటు చేసే కాయిన్‌వెండిరగ్ మిషన్లు వల్ల అయ్యే ఖర్చు రైల్వే అథికారులు కనుక్కోకుండానే మిషన్లు పెట్టేయమని ఆదేశాలు జారీ చేసేసింది. పెద్దరైల్వేస్టేషన్లలో నాలుగు కాయిన్‌వెండిరగ్ మిషన్లు ఏర్పాటు చేయాలని రైల్వేశాఖ ఆదేశించింది. చిన్నస్టేషన్లలో రెండు మిషన్లు ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఇప్పటి దాకా టిక్కెట్టు తీసుకునే ప్రయాణికులు, రైల్వే సిబ్బంది కూడా చిల్లర గురించి సమస్యలు ఎదుర్కొన్నారు. దీంతో రైల్వేశాఖ, కేంద్ర ఆర్థికశాఖను ఈ సమస్య పరిష్కారానికి సంప్రదించింది. బ్యాంకుల్లో కాయిన్‌వెండిరగ్‌మిషన్లు ఉంచారు కాబట్టి దాన్ని రైల్వేస్టేషన్లలో పెట్టుకోవాలని ఆ శాఖ సూచించింది. రైల్వేబోర్డు ఆ సూచన అందుకోగానే కాయిన్‌వెండిరగ్‌మిషన్లను ఏర్పాటు చేయాలని అన్ని జోనల్‌అథికారులకు ఆదేశాలు ఇచ్చింది. జోనల్ అథికారుల ద్వారా రైల్వేస్టేషన్లకు ఈ వెండిరగ్‌మిషన్లను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశాలు వచ్చాయి. ఏటిఎం తరహాలో ఉండే ఈ మిషన్లు ఏర్పాటు చేయటానికి రూపాయి లైసెన్స్‌ఫీజుగా చెల్లించాలి. అలానే కరెన్సీ నోట్లు వేసి మీట నొక్కితే చిల్లర వచ్చేలా బ్యాంకులు ఈ వెండిరగ్‌మిషన్లు ఏర్పాటు చేశాయి. అయితే ప్రయాణీకుడు ఈ వెండిరగ్ మిషన్ ఉపయోగించుకుని చిల్లర తీసుకుంటే మరి కమిషన్ ఉంటుందా? లేదా? అన్న అంశం ఇంకా తెలియలేదు. ఒకవేళ రైల్వే సిబ్బందే దీన్ని వినియోగిస్తే మాత్రం కమిషన్ భారం ఎవరిపై పడుతుందన్నది కూడా అర్థం కాలేదు.