ఎపిలో 9 గ్యారెంటీలను అనౌన్స్ చేసిన షర్మిల
posted on Mar 30, 2024 @ 4:54PM
తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఎన్నికల వాగ్దానంలో పేర్కొన్న కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో తొమ్మిది గ్యారెంటీలను అమలుచేస్తామని వాగ్దానం చేస్తుంది. ఇవాళ విజయవాడలో కాంగ్రెస్ నేతల సమావేశానికి ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హాజరయ్యారు. గడప గడపకు కాంగ్రెస్ పార్టీ పేరిట కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 9 గ్యారెంటీలను ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీ 9 గ్యారెంటీలు
1. ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే హోదా అమలు
2. మహిళా వరలక్ష్మి పథకం పేరిట ప్రతి పేద మహిళకు నెలకు రూ.8,500
3. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ
4. రైతులకు పెట్టుబడిపై 50 శాతం లాభంతో కొత్త మద్దతు ధర
5. ఉపాధి హామీ కూలీల కనీస వేతనం రూ.400 అందజేత
6. రాష్ట్రంలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య
7. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2.25 లక్షల ఉద్యోగాల భర్తీ
8. ఇల్లు లేని ప్రతి పేద మహిళకు రూ.5 లక్షల పక్కా ఇల్లు
9. అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ.4 వేల పింఛను... ఇంట్లో ఎంతమంది అర్హులు ఉంటే అందరికీ పింఛను