శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పలు విమానాలు దారి మళ్లింపు
posted on Aug 13, 2025 @ 6:45PM
శంషాబాద్ ఎయిర్‌ఫోర్టులో పలు విమానలు అధికారులు దారి మళ్లించారు. వాతావరణం అనుకూలించకపోవడంతో ఎనిమిది విమానాలను దారి మళ్లించినట్లు తెలిపారు. హైదరాబాద్‌కు రావాల్సిన విమానాలను విజయవాడ, బెంగళూరు, తిరుపతికి మళ్లించినట్లు పేర్కొన్నారు. విజయవాడకు ఐదుకు, బెంగళూరుకు మూడు, తిరుపతికి ఒక విమానాన్ని మళ్లించినట్లు తెలిపారు.
హైదరాబాద్ నుంచి బయలుదేరాల్సిన విమానాలను తాత్కాలికంగా రద్దు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. తెలంగాణ వ్యాప్తం పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నగరాన్ని మొత్తం కారు మేఘాలు కమ్మేశాయి. ఈ క్రమంలోనే విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు సమాచారం. వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసిన విషయం తెలిసిందే.