ఆత్మహత్యకు యత్నించిన టిడిపి మోదుగుల
posted on Feb 13, 2014 @ 12:32PM
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టగానే తీవ్ర ఉద్రిక్త పరిణామాలు చోటు చేసుకున్నాయి. టి.బిల్లును షిండే సభలో ప్రవేశపెడుతున్న సమయంలో పేపర్లు లాక్కునేందుకు ఎంపీ సబ్బంహరి యత్నించగా, టీ.ఎంపీలు షిండేకు రక్షణగా నిలిచారు. మరోవైపు టి.బిల్లును ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ టీడీపీ ఎంపీ మోదుగుల సభలో హల్‌చల్ చేశారు. మైకులను పగుల గొట్టారు, లోక్ సభ సెక్రటరీ జనరల్ వద్ద టేబుల్ అద్దాలు పగులగొట్టి పొడుచుకునేందుకు యత్నించిన మోదుగులను తెలంగాణ ఎంపీలు అడ్డుకున్నారు. అటు లగడపాటిపై ఎంపీలు గుత్తా, మందా జగన్నాథం చేయిచేసుకున్నారు. లగడపాటిని ఎంపీ మందా కిందేసి తొక్కేందుకు యత్నించగా కేంద్ర మంత్రి పళ్లంరాజు అడ్డుకున్నారు.