ఆంటోని కమిటీని కలిసిన సీమాంద్ర నాయకులు
posted on Aug 21, 2013 8:16AM
రాష్ట్ర విభజన విషయంలో ఆంటోని కమిటీని కలిసి సీమాంద్ర ప్రాంత నాయకులు మరోసారి తమ అభిప్రాయాలను కమిటీ ముందుంచారు. రాష్ట్రవిభజన వల్ల సమస్యలు తీరక పోగా పార్టీకి రాష్ట్రానికి కొత్త సమస్యలు తలెత్తుతాయని వారు కమిటీకి నివేదించారు.
ప్రస్థుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులతో పాటు విభజన వల్ల విద్య, వైద్య, ఉపాది కల్సన, హైదరాబాద్ లాంటి విషయాల్లో తలెత్తే వివాదాలను కూడా కమిటీతో చర్చించామన్నారు. నీటి సమస్యలను తరువాత పరిష్కరించుకోవచ్చన్న వాదనను తొసి పుచ్చారు.
ఈ భేటిలొ సీమాంద్ర మంత్రులతో పాటు ఎంపిలు, ఎమ్మేల్యేలు పాల్గొన్నారు. జెసి దివాకర్‌రెడ్డి మాత్రం రాయల్ తెలంగాణ అంశాన్ని ప్రస్దావించారు. విభజన అనివార్యమౌన పక్షంలో రాయలతెలంగాణనే ఇవ్వండని ప్రతిపాదించారు. కమిటీ సభ్యులను రాష్ట్రానికి ఆహ్వానించామని తెలిపారు.