బ్యాగులో రహస్యం బట్టబయలు!
posted on Oct 31, 2022 @ 3:21PM
బ్యాగులో పుస్తకాలు పెట్టుకుంటారు, బ్యాగులో దుస్తులు పెట్టుకుంటారు. బ్యాగులో పాముల్లాంటి జాబితాను పెట్టుకు తిరుగుతున్నది మాత్రం బీజేపీ వారే. ఆ బ్యాగులోంచి పెద్ద కాయితాల దొంతర లాగితే ఏకంగా తెలంగాణా నుంచి బీజేపీలోకి జంప్ జిలానీల జాబితానే బయటపడిందిట పోలీసులకు. ప్రస్తుతం తెలంగాణా ప్రతిష్టను దెబ్బతీసిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం జంప్ జిలానీల సంఖ్య కొండవీటి చాంతాడంత ఉందంటూ ఆ జాబితాలో బయటపడటంతో మరింత ఆసక్తి కరంగా మారింది. టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలను అమాంతం తమ వేపు లాక్కోవడానికి కమలనాథులు వేసిన వలలో చిక్కి కండువా మార్చడానికి, కారు వదిలేసి కాషాయం కప్పుకోవడానికి రెడీగా ఉన్నారంటూ బీజేపీ పెద్ద జాబితానే సిద్ధం చేసింది. మొన్న కేసులో దొరికిన ముగ్గురు నిందితులు మొయినా బాద్ ఫామ్ హౌస్ కి వారిలో ఒకరయిన నందకుమార్ వచ్చిన కారులో నే వచ్చారు. కానీ అందులో డబ్బులు ఉన్నా యన్న అనుమానాలు వ్యక్తం అయినప్పటికీ పోలీసులు మాత్రం అందులోంచి పెద్ద జాబితానే బయటకు లాగారు. ఆ జాబితా ప్రకారం టీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీల కు చెందిన 50 మంది ఎమ్మెల్యేలు, వీరుగాక మరో 119 మంది తెలంగాణా రాజకీయ నాయకుల పేర్లు ఉన్నాయన్నది బయటపడింది.
27 కాయితాలలో తెలంగాణా సమస్యలతో పాటు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్న వారి పేర్లతో సహా ఉందంటున్నారు పోలీసులు. ఈ మెటీరియల్, ఒక డైరీ, ఒక లాప్ టాప్ కూడా స్టింగ్ ఆఫరేషన్ జరిగిన మొయినాబాద్ ఫామ్హౌస్లోనే వేరు వేరు బ్యాగుల్లో లభించిందని పోలీసులు ఏసిబీ కోర్టుకు తెలియ జేశారు. డాక్యుమెంట్లు ఒక పేపర్ కవర్లో ఉన్నాయి. అవి కూడా నందకుమార్, బీజేపీ మధ్య సంబం ధాలను తేటతెల్లం చేస్తున్నాయి. ఇవేగాకుండా, పోలీసు అధికారులకు ఒక డైరీ లభించింది. అందులో రామచంద్ర భారతి ప్రయాణాల గురించిన సమాచారం పొందుపరిచి ఉందిట.
ఢిల్లీ నుంచిహైదరాబాద్ కి రావడం, ఇక్కడ అపాయింట్మెంట్లు, సమావేశాలు ఎలా చేపట్టాలో అంతా నందూ వ్యూహా త్మకంగా నిర్వహించడం గురించిన సమాచారం అంతా వివరంగా ఉంది. అలాగే తమ పని అయిన తర్వాత ఢిల్లీ తిరిగి వెళ్లేంతవరకూ ఎలా ఉండాలి అన్నది మొత్తం వివరంగా రాసి ఉందిట. ఇక లాప్ టాప్ మాత్రం రామచంద్ర భారతీది అని తేలింది. అలాగే రెండు వేరు వేరు బ్యాగులో సింహ యాజి, భారతీ దుస్తులు దొరికాయి. ఇవే గాక, నలుగురు టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల పై జరిపిన స్టింగ్ ఆప రేషన్ సంబంధించి స్పై కెమెరాలు, వాయిస్ రికార్డర్లు పోలీసులకు లభించాయి. రోహిత్ రెడ్డి తమకు వంద కోట్లు ఆశచూపారని ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
తమకు ముందే సమాచారం అందిందని దాని ప్రకారం సిటింగ్ ఎమ్మెల్యేలను పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారని, వారు హైదరాబాద్ లోనే ఉన్నారని వెంటనే అందుకు సమావేశం ఏర్పాటు చేయాలని, అపా యింట్మెంట్ కావాలని ఉంది. అంతకంటే ముందు వారిలో ముగ్గురు ముందుగా కొంత సొమ్ము ఆశిస్తు న్నారని, వారితో ఆ విషయంలో సంప్రదించడానికి సంతోష్ బీజేపీ అనే కాంటాక్ట్ ను తన ఫోన్ లో సేవ్ చేసుకున్నాడని ఆ సమాచారం స్పష్టంచేసింది. ఇలాంటివే అనేక ఇతర ఎస్ఎంఎస్ మెసేజ్ లు నింది తుల ఫోన్లలో లభించాయని పోలీసులు తెలిపారు.