సరోగసి...ఈ తరం మహిళల్లో సంతానం ఆశ!
posted on Oct 13, 2022 @ 10:34AM
చదువు, మంచి ఉద్యోగం, పెళ్లి ఆ తర్వాత పిల్లలు.. ఇదే ప్రతీ యింట్లో పెద్దవాళ్లు వాళ్ల పిల్లల నుంచీ ఆశించేది. పూర్వం ఇల్లంతా పారాడుతూ, ఆడుతూ పిల్లలుండేవారు, ఆ తల్లుల్ని సంతానలక్ష్మీ అని పిలిచేవారు. ఆ కాలం దాటి చాలా ముందుకువచ్చేశాం. ఇపుడు అంతా కెరీర్ ఓరియంట్ జీవితా లయిపోయాయి. కెరీర్ జీవితంలో సింహభాగం ఆక్రమించేసింది. అబ్బాయిలు, అమ్మాయిలూ అదే దృష్టితో జీవితంలో ముందుకు వెళుతున్నారు. పెళ్లి మీద, సంతానం మీద శ్రద్ధపోయింది. పెళ్లయినా ఒక్కరిద్దరు కాదు ఒక్కరే ముద్దని సరిపెట్టుకునేంతగా బిజీ అయిపోయారు. శనివారమో, ఆదివారమో తప్ప ఒకరినొకరు కాస్తంత ప్రశాంతంగా మాట్లాడుకునే స్థితిలో లేరు. కొందరు అసలు పిల్లలు కనడం విషయంలోనూ మరో ఆలోచన చేస్తున్నారు. ఆ ఆలోచనే సరో గసీ! ఇటీవలి కాలంలో ఈ సరోగసీ గురించిన చర్చ జరుగుతోంది. కారణం సమాజంలో సెలబ్రెటీలు దాని పట్ల మక్కువ చూపు తుండడంతో ఆ ఆలోచన అందరికీ నచ్చుతోంది.
అయితే ఇది ఎంతవరకూ సమంజసం సామాజికంగా, వైద్యపరంగా ఎంత వరకూ అంగీకరించదగ్గదా అన్నది చర్చనీయాంశంగా మారింది. అనారోగ్యం, పిల్లలు పుట్టరని డాక్టర్లు నిర్ధారించిన వారు జీవితంలో పిల్లలతో జీవించాలన్న ఆనందంకోసం అలాంటి తప్పనిస్థితిలో ఈ సరోగసీ పద్ధతికి మొగ్గు చూపు తున్నారు. అయితే దీన్ని కొందరు దుర్విని యోగం చేస్తున్నా రన్న వార్తలు వినవస్తున్నాయి. కానీ అందులో నిజానిజాలు తేలవలసి ఉంది. ఇటీవలి కాలంలో సినీరంగంలో కొంద రు సెలబ్రిటీ లు ఈ పద్ధ తిని అనుసరించారు. టాలివుడ్ కోలివుడ్ నటి నయన తార సరోగసి పద్దతి లో కవలలకు జన్మని వ్వడం విన్నాం. ఇక సరో గసిలో వైద్యులు చెపుతున్న వివరాల ప్రకారం శుక్రకణాలు X,X కలిస్తే ఆడ పిల్లని XY. కలిస్తే మగ పిల్లవాడని ఒక సరోగట్ కు ఒకరిని మాత్రమే కనాలని నిబంధన ఉన్నా, కవలలు సాధ్యమా అన్న ప్రశ్నకు గైనకాలజిస్టులు సరైన సమాధానం చెప్పలేక పోతున్నారు.
భారత ప్రభుత్వం సరోగసితో వ్యాపారం చేయడాన్ని నివారించేందుకు జనవరి 25 న సరోగసి చట్టం 2021 తెచ్చింది. ప్రముఖ వైద్య నిపుణులు అంశుమన్ కుమార్ మాట్లాడుతూ, సరోగసి వైద్య ప్రక్రియ దంపతు లకు సంతానం కలగదో పిల్లలు కావాలని కోరు కుంటారో వారు గర్భసంచిని అద్దెకు తీసుకోవచ్చు.అలా గర్భాన్ని అదీకిచ్చే మహిళను సరోగేట్ అని అంటారు. సంతానం కోరుకునే వారిలో శుక్రకణా లను, అండాశయం లోనుండి తీసి ల్యాబ్ లో పరీక్షించిన తరువాత వైద్య ప్రక్రియ ద్వారా వాటిని సంక రం చేస్తారు. వైద్య విధానం ద్వారా మాత్రమే సరోగేట్ గర్భసంచిలో చేరుస్తారు. సరోగేట్ గర్భంలోనే పిండం పెరుగుతుంది. ఆమె తొమ్మిది మాసాల తర్వాత జన్మనిస్తుంది ఈసమయంలో సరోగేట్ తో జరిగిన ఒప్పందం ప్రకారం వైద్య ఖర్చు దంపతులే భరిం చాలి మనదేశం లో ఉన్న ఆర్ధిక అసమా నతలు బలహీనంగా ఉన్న మహిళలు సులభంగా సరోగేట్ తల్లులు లభిస్తూ ఉండడంతో విదేశీయులు, ఆర్ధికంగా బలంగా ఉన్నవారు పిల్లలను కనేందుకు ఈ మార్గం ఎంచుకోవడం ఈ పద్దతిలో పిల్లలను పొందడం సరోగేట్ తల్లికి డబ్బులు ఆశచూపడం చట్టప్రకారం ఇది నిషేదించిన కొన్ని నియమ నిబంధనలను రూపొందించి సరోగాసిని నివా రించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నం హర్షణీయం.
డిల్లి హైకోర్ట్ న్యాయవాది కరణ్ సింగ్ మాట్లాడుతూ సరోగసి నియంత్రణ చట్టం రెగ్యు లేషన్ యాక్ట్ 2021 ప్రకారం వ్యాపార సంబం ధ సరోగాసిని నిలుపుదల చేసింది. డిసెంబర్ 2౦21 పార్లమెంట్ లో చట్టం ఆమోదించింది. జనవరి 25 2022న ఈ చట్టాన్ని రాష్ట్రపతి ఆమోదించడంతో న్యాయశాఖ గెజిట్ నోటిఫి కేషన్ జారీ చేసింది. చట్టం ప్రకారం సరోగసి నిబంధనలకు లోబడి పరస్పర పరో పకారంతోనే సరోగాసీకి అనుమతిస్తారు. సరోగేట్ తల్లికి తప్పనిసరిగా దంపతులు ఇన్సూరెన్స్ తప్పనిసరిగా చేయా ల్సి ఉంటుంది. ఆమెకు ౩6 నెలలు నిండి ఉండాలి. దీనితోపాటు సరోగేట్ తల్లికి అయ్యే వైద్యం ఖర్చు దంప తులె భరించాలి. సరోగేట్ తో మరే ఇతర ఆర్ధిక లావాదేవీలు నిర్వహించారాదు. ఏ క్లినిక్ లో అయితే సరోగాసి చేస్తున్నారో అది తప్పనిసరిగా రిజిస్టర్ అయి ఉండ డం తప్పనిసరి.
సరోగేట్ మదర్ విషయానికి వస్తే.. హైకోర్ట్ న్యాయావాది నవీన్ శర్మ చెప్పిన వివరాల ప్రకారం కొన్ని నిబందనలు చేర్చారు. ఎవరైనా ఒకమహిళ ఒక్కసారి మాత్రమే సరోగేట్ మదర్ గా ఉంటుంది. ముందే ఆమె వివాహిత అయ్యి ఉండాలి. ఆమెకు ఎటు వంటి మత్తు పదార్ధాలు తీసుకునే అలవాటు ఉండకూడదు. వైద్య పరంగా ఆమె ఫిట్ గా ఉండాలి. ఒక వేళ సరోగేట్ తల్లికి ఇన్సూ రెన్స్ చేయించక పోవడం, వైద్య ఖర్చులు ఇచ్చే నిబంధన ను ఉల్లంఘిస్తే ఆ దంపతులకి పదేళ్లు జైలు పది లక్షల జరిమానా విధిస్తారు. దంపతులలో పురుషుల వయస్సు 26 నుంచీ 55 సంవత్సరాల మధ్య ఉండాలని స్త్రీల వయస్సు 23 నుంచీ 50 సం వత్సరాల మధ్యలో ఉండాలి. విడాకులు తీసుకున్న వివాహితలు, వేరుగా జీవిస్తున్న వారు హోమో సేక్షువల్స్ సరోగాసికి అను మతిలేదని నిబంధనలో పేర్కొన్నారు. కాగా సరోగాసి ద్వారా పుట్టిన బిడ్డకు రక్షణ సంరక్షణ విధానం లో ఏమాత్రం నిర్లక్ష్యం చూపరాదని ఇందు కోసం సరోగసి చట్టంతో పాటు బాలల సంరక్షణ, దత్తత కార్ నిబంధన 2015 ప్రకారం అనుసరిం చాలని, తద్వారా బాలిక సంరక్షణ కలిగిస్తుందని అయితే సరోగసి నిషేదింప బడలేదని సరోగసి ని నియంత్రణ చేసేందుకు చట్టం రూపొం దించామని నిపుణులు పేర్కొన్నారు.