అతనోక విషపురుగు-సానియా
posted on Sep 19, 2016 @ 12:38PM
భారత టెన్నిస్‌లో వివాదం ముదురుతోంది. గత రెండు ఒలింపిక్స్‌లకు డబుల్స్ జోడీల ఎంపికపై భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ చేసిన విమర్శలు కలకలం రేపుతున్నాయి. దీనిపై భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి తీవ్రంగా స్పందించారు. అతనోక విషపురుగు అంటూ పేసును ఉద్దేశిస్తూ పరోక్షంగా విమర్శించింది. సమస్యలు సృష్టించే వ్యక్తులతో కలిసి ఆడకపోవడమే విజయం సాధించడమని ట్వీట్ చేశారు. గత రెండు ఒలింపిక్స్ టెన్నిస్ డబుల్స్‌లో అత్యుత్తమ జోడీలను పంపలేకపోయామని పేస్ వ్యాఖ్యానించారు. లండన్, రియో ఒలింపిక్స్‌లకు మనదేశం తరపున మేటి జంటను పంపలేకపోయామని..అందుకు భారీ మూల్యాన్ని చెల్లించుకున్నామన్నారు. అంతేకాకుండా సానియా, రోహన్ బొపన్నను ఎంపిక చేయడాన్ని పేస్ తప్పుపట్టారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సానియా పై విధంగా స్పందించారు. అయితే వీరిద్దరి వివాదం భారత టెన్నిస్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వివాదం ఇంకేంత దూరం వెళుతుందో వేచి చూడాలి.