సంగారెడ్డి జాతిరత్నాలు..
posted on Mar 23, 2021 @ 3:02PM
ఆగు అనగానే ఆగడానికి అది మనం పెంచుకునే కుక్క నా.. వాహనం ఇక్కడ బ్రేక్ తొక్కితే కొంత దూరం వెళ్లి ఆగుతుంది. అలా సడెన్ గా బ్రేక్ వేస్తె ప్రమాదం జరిగే ఛాన్స్ కూడా ఉంది. అందుకనే ఆ డ్రైవర్ కొంత దూరం వెళ్లి వాహనం ఆపాడు.. వాళ్లు చెప్పిన చోట వాహనం ఆపలేదని కాస్త దూరం వెళ్లి ఆపిన పాపానికి బులెరో డ్రైవర్‌పై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. బహుశా పోలీస్ కు ఇగో హర్ట్ అయిందో.. లేదంటే ఇంట్లో పెళ్ళాం టార్చెర్ ఎక్కువైయిందో ఏమోగాని ఫ్రస్టేషన్లో డ్రైవర్ ని బూటు కాలుతో తన్నుతూ.. లాఠీలతో రక్తం కల్ల చూసేలా చితకబాదారు. డ్రైవర్ లబోదిబో మని అరిచినా ఆగలేదు సంగారెడ్డి ఫ్రెండ్లీ పోలీస్. ఇష్టమొచ్చినట్లు చితకబాదారు.
ఈ ఘటన సంగారెడ్డి జిల్లా, సదాశివపేటలో చోటు చేసుకుంది. సదాశివపేటకు చెందిన వాజిద్ బొలెరో వాహనం నడుపుతుంటాడు. సింగూరుకు కిరాయికి వెళుతుండగా అయ్యప్పస్వామి గుడివద్ద పోలీసులు వాహనాలు తనికీలు చేశారు. ప్రధాన రహదారిపై ఆకస్మికంగా పోలీసులు రావడంతో వాహనాన్ని కొంచెం దూరం తీసుకువెళ్లి ఆపాడు వాజిద్ . దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు లాఠీతో వాజిద్ ను చితకకొట్టరు.
అక్కడితో ఆగకుండా బూటు కాలితో తంతూ బండా బూతులు తిట్టారు. లాఠీ దెబ్బలకు వాజిద్ తీవ్రంగా గాయపడ్డాడు. ఓ వైపు ఫ్రెండ్రీ పోలీసు అని ఉన్నతాధికారులు చెబుతుంటే.. కింది స్థాయిలో అమలు కాకపోవడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాజిద్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు తన వాళ్ళు..