ముగిసిన సండ్ర కస్టడీ
posted on Jul 10, 2015 @ 4:33PM
ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న సండ్ర వెంకట వీరయ్య కస్టడీ ముగిసింది. రెండు రోజుల విచారణ జరిపిన ఏసీబీ అధికారులు సండ్రను వైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి అనంతరం కోర్టు ముందు హాజరుపరచనున్నారు. అయితే విచారణలో ఏసీబీ అధికారులు సండ్ర పై పలు ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. ఏ ఏ ఎమ్మెల్యేలతో మీరు మాట్లాడారు అని ఏసీబీ అధికారులు అడుగగా సండ్ర మాత్రం ‘‘నేను ఎమ్మెల్యేను.. ప్రతిపక్షానికి చెందిన సభ్యుడిని.. నాకు ప్రతిరోజు ఎన్నో ఫోన్లు వస్తుంటాయి. అందులో సగంమందిని చూస్తేగానీ గుర్తుపట్టలేని పరిస్థితి’’ అంటూ స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే ఉదయం నుండి సాయంత్రం వరకు మొత్తం 70 ప్రశ్నలకు పైగా సండ్రను అడగగా సండ్ర మాత్రం ఎక్కడా తడబడకుండా ఏసీబీ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా సండ్ర బెయిల్ పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా పడిన సంగతి తెలిసందే.