సల్మాన్ రష్దీని సీఎం మమత బెదిరించింది

 

 

 

 

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై వివాదాస్పద రచయిత సల్మాన్ రష్దీ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. గత నెల 30వ తేదీన సల్మాన్ రష్దీ కోల్‌కతా సాహిత్య సమ్మేళనానికి హాజరుకావాల్సివుంది. దీనితో పాటు ఆయన నవల 'మిడ్ నైట్ చిల్డ్రన్' ప్రచార కార్యక్రమం ఉంది.


కోల్‌కతా వెళ్ళడానికి సిద్దమైన తనను పోలీసులు సంప్రదించి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ అడుగు పెట్టవద్దని చెప్పారు. కోల్‌కతా కు మీరు వస్తే మతఘర్షణలు వస్తాయని,అందువల్ల మీరు రాకుండా చర్యలు తీసుకోవాలని మమత ఆదేశించారని పోలీసులు చెప్పినట్లు తెలిపారు. ఒకవేళ వస్తే మిమ్మల్ని మూట కట్టి తరువాతి విమానంలో వెనక్కి పంపిస్తామని మమత చెప్పినట్లు సల్మాన్ రష్దీ వెల్లడించారు.

 
అయితే, రష్దీని తామేమీ పిలవలేదని సాహిత్య సమ్మేళనం నిర్వాహకులు వేరే ప్రకటనలో ఖండించారు. దానిపై రష్దీ స్పందిస్తూ.. అది అమర్యాదకరమని, వాళ్లే తన విమానం టెకెట్లు బుక్ చేశారన్నారు. మమత ఒత్తిడి వల్లే వాళ్లలా మాట్లాడి ఉండొచ్చని ఆరోపించారు.