సానియాకి కోటి ఓకే.. నా డబ్బుల మాటేంటి: సైనా!!
posted on Jul 25, 2014 @ 10:14AM
టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించిన వివాదం ఇంకా రగులుతూనే వుంది. ఇంతలో మరో క్రీడాకారిణి నా సంగతేంటంటూ రంగంలోకి వచ్చింది. ఆమె మరెవరో కాదు. బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్. 2012లో లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన తర్వాత ప్రభుత్వ నిబంధనల ప్రకారం తనకు ప్రభుత్వం నుంచి అందాల్సిన మొత్తం ఇప్పటికీ అందలేదని సైనా వ్యాఖ్యానించింది. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా సానియా మీర్జా ఎంపిక కావడం, ఆమెకు కోటి రూపాయలు నజరానాగా ఇవ్వడం నాకు సంతోషాన్ని కలిగించే అంశమే. అయితే నేను నా సంగతి ఏమిటని అడుగుతున్నాను. రెండేళ్ల క్రితం ఒలింపిక్స్‌లో దేశానికి కాంస్య పతకం అందించాను. కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించిన నగదు ప్రోత్సాహకమే రాష్ట్ర ప్రభుత్వంనుంచి దక్కకపోవడం నాకు బాధ కలిగిస్తోంది’ అని సైనా నెహ్వాల్ ట్వీట్ చేసింది. సైనా ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన సమయంలో అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆమెకి 50 లక్షలు బహుమతి ప్రకటించారు.