సేఫ్ ఫార్మాను అన్ సేఫ్ చేసిన వైసీపీ
posted on Apr 28, 2023 @ 4:44PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న రాజధానిని గాలికొదిలేసి మూడు రాజధానులు తెస్తానంటున్న వైసీపీ ప్రభుత్వం తాజాగా మరో రాజధానిని కూడా తయారు చేస్తోంది. దేశంలోనే అధికంగా గాంజాయి సప్లై చేస్తున్న రాష్ట్రంగా పేరు సంపాదించిన ఆంధ్రప్రదేశ్ కీర్తి ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా విస్తరించింది. నరసరావు పేటలోని సేఫ్ ఫార్మాలో తయారైన డ్రగ్స్ ప్రపంచంోని అన్ని దేశాలకూ ఎగుమతి అవుతున్నాయని జతీయ మీడియా ప్రచురించింది. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన ఈ వార్తా కథనంతో సేఫ్ ఫార్మా డ్రగ్స్ దందా ప్రపంచానికి తెలిసింది.
గత మూడు రోజులుగా జిల్లాలో జరిగిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కర్యక్రమంపై స్పందించిన వైసీపీ నేతలు చంద్రబాబును విమర్శించడమే కాకుండా.. కోడెల శివప్రసాద్ పేరును, ఆయన మరణానికి కారణాలను చర్చించారు. అంటే సేఫ్ ఫార్మా విషయం వారికి ముందే తెలుసని అందుకే కోడెల ప్రస్తావన తెచ్చారని మీడియా మిత్రులు చెబుతున్నారు. 1982లో స్థాపించిన సేఫ్ ఫార్మా గతంలో డాక్టర్ కోడెల అధీనంలో ఉండేది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సేఫ్ ఫార్మాని బలవంతగా లాక్కొని కోడెల మరణానికి వైసీపీ కారణమయ్యారని నరసరావుపేట ప్రజలు బాహాటంగానే చెప్పుకుంటారు. నొప్పుల నివారణకు వినియోగించే ట్రమడాల్ అనే డ్రగ్ ఉత్పత్తికి కోడెల అంగీకరించకపోవడమే ఆయన ఆత్మ హత్యకు కారణమని ఆయన అభిమానులు అంటున్నారు. దీంతో కోడెలపై కక్ష కట్టిన వైసీసీ గ్యాంగ్ఆయనను వేధించి చివరకు ఆయన చావుకు కారణమయ్యారని వారి వాదన. తాజాగా ఫిబ్రవరి 27వ తేదీన సుడాన్ దేశంలో అక్కడి కస్టమ్స్ అధికారులు 21 కోట్ల రూపాయల విలువైన ట్రమడాల్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
సేఫ్ ఫార్మా తయారు చేసిన డ్రగ్స్ సుడాన్ ద్వారా మిగిలిన దేశాలకు సరఫరా అవుతున్నాయని అధికారులు గమనించారు. ఈ డ్రగ్స్ ను ఎక్కువగా ఉగ్రవాదులు వినియోగిస్తున్నారనీ, వారి కోసమే ఈ డ్రగ్ ప్రత్యేకంగా తయారౌతోందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన తీగను లాగితే.. దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ లోని నరసరావుపేటలో ఉన్న సేఫ్ ఫార్మాస్యూటికల్స్ ప్రయివేట్ లిమిటెడ్ అనే కంపెనీ చరిత్ర బయటకు వచ్చింది. డ్రగ్స్ కంట్రోల్ మీడియా సర్వీసెస్ అనే ఆర్గనైజేషన్ ఈ నెల 26న ఈ విషయాన్ని పేర్కొంది. బెంగళూరు తో సహా మరికొన్నినగరాలలో పరిశీలించిన అధికారులు సేఫ్ ఫార్మా డైరెక్టర్ శనగల శ్రీధర్ రెడ్డిని అరెస్టు చేశారు.
మరో డైరెక్టర్ గాదె కనిగిరి ప్రస్తుతం అందుబాటులో లేరని తెలుస్తోంది. వీరు ఇరువురూ 2020 మే 13వ తేదీన ఈ కంపెనీ డైరెక్టర్లుగా ఎంట్రీ ఇచ్చారు. 2019 సెప్టెంబర్ 16న కోడెల మరణం తరువాత కొత్త బోర్డు ఏర్పాటైంది. ఈ స్మగ్లింగ్ తో వైసీపీ ఎంపీకి కూడా సంబంధాలున్నాయని ఆరోపణలున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సేఫ్ ఫార్మాకు ఆర్డర్లు భారీ స్థాయిలో అందడం కొసమెరుపు.