Read more!

పెళ్లి చేసుకోవాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారా? సద్గురు ఏం చెప్పారో తెలుసుకోండి.!

పెళ్లి అనేది ప్రతి వ్యక్తి జీవితంలో ఎంతో ముఖ్యమైన దశ.  ఒకప్పుడు అమ్మాయిలకు, అబ్బాయిలకు 20ఏళ్ళలోపే పెళ్లి చేసేవారు.. ఆ తరువాత కాలంతో పాటు మార్పులు వచ్చాయి. నిర్ణీత పెళ్లి వయసులో మార్పులు వచ్చాయి. అయితే అమ్మాయిలు కూడా  చదువు, ఉద్యోగం  సెటిల్మెంట్ మొదలైన విషయాల గురించి ఆలోచిస్తూ పెళ్లికి అంత తొందరగా సిద్దం కావడం లేదు. అబ్బాయిలు కూడా చాలానే గోల్స్ పెట్టుకుంటున్నారు. ఈ కారణంగా పెళ్లి విషయంలో  జాప్యం    జరుగుతూ వస్తోంది. చదువులు, ఉద్యోగం ఇతర విషయాలలో సెటిల్ అయ్యాక చాలామంది ఇక పెళ్లి అవసరమా అని  అంటూ ఉంటారు. కానీ తల్లిదండ్రులు సమాజం మాత్రం వదిలిపెట్టదదు. పెళ్లి గురించి బోలెడు ప్రశ్నలు సంధిస్తూనే ఉంటుంది. అందుకే కొందరు ఏదో ఒకటి అని పెళ్లి చేసుకుంటారు. అయితే ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీవాసుదేవ్ గారు పెళ్లి చేసుకోవాలా వద్దా అనే విషయం గురించి స్పష్టమైన సమాధానం ఇచ్చారు. ఆయనేం చెప్పారో తెలుసుకుంటే..

పెళ్లి ఎందుకు చేసుకోవాలి?

పెళ్లి చేసుకోవడం వల్ల ఎలాంటి నష్టం లేదు. వివాహం కేవలం ఒక సంస్థ.  దానిని విశ్వసించాలా వద్దా అనేది పూర్తిగా మీపై ఆధారపడి ఉంటుంది. పెళ్లి అనేది సమాజం పెట్టిన లేబుల్ మాత్రమే. కానీ  పెళ్లి అవసరం లేనప్పుడు కూడా   చేసుకుంటే అది నేరమవుతుంది.  ఎందుకంటే మీరు మీ జీవితంలో పెళ్లి చేసుకుని  మరొకరిని బాధపెడతారు.


పెళ్ళి చేసుకోవాలి అని అనిపించినప్పుడు పెళ్లి చేసుకోవచ్చు. అయితే పెళ్లి చేసుకోవడం వెనుక  అవసరాలను అర్థం చేసుకోవాలి.  అవసరాలు చాలా బలంగా ఉంటే నిజంగానే  వివాహం చేసుకోవాలి. అదే  అవసరాలను నియంత్రించగలిగితే, పెళ్లి ఆలోచనను వదులుకోవాలి. ఎందుకంటే సంతోషంగా లేని వివాహం కంటే ఒంటరిగా సంతోషంగా ఉండటమే మేలు. సమాజం చెప్పే మాటల వల్లనో, వేరే వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారనో పెళ్లి చేసుకోకూడదు.

ఎంపిక..

పెళ్లి అంటే  జీవిత భాగస్వామి మద్దతు పొందడం అనడంలో సందేహం లేదు. నేటి కాలంలో, ప్రతి వ్యక్తి తన జీవిత భాగస్వామితో తన జీవితాన్ని గడపాలని కోరుకుంటాడు. గౌరవించడమే కాకుండా  అర్థం చేసుకుంటారు. ఎందుకంటే వివాహం అనేది జీవితకాల ప్రయాణం. అందుకే మద్దతు తెలిపే భాగస్వామిని ఎంచుకోవడం ముఖ్యం.

శారీరక అవసరాలకు వివాహం అవసరం

మన సమాజంలో స్త్రీ పురుషులు వివాహానంతరం ఒకరికొకరు దగ్గరవ్వడం సరైనది,   సముచితమైనదిగా పరిగణించబడుతుంది. లైంగిక సాన్నిహిత్యం కోసం  వివాహం అవసరమని ప్రజలు భావించడానికి ఇది కూడా ఒక కారణం. అయితే, వివాహం  స్వంత అవసరాలకు అనుగుణంగా ఉండాలి.  అవసరాలు భౌతికంగా,  మానసికంగా ఉండవచ్చు. అయితే  సామాజిక లేదా ఆర్థిక కారణాల కోసం మాత్రమే వివాహం చేసుకోకూడదు.

ఫర్పెక్ట్ మ్యాచ్ కోసం చూస్తున్నారా?

ఈ రోజుల్లో జీవిత భాగస్వామికి సంబంధించి ప్రజల ఉద్దేశాలు చాలా వేగంగా మారుతున్నాయి. ఇలాంటి  పరిస్థితిలో  ఆదర్శవంతమైన పురుషుడు లేదా స్త్రీ కోసం వెతకకూడదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరూ పరిపూర్ణులు కారు.  భాగస్వామి అవసరమని భావిస్తే,  కావలసినది  అందించే   వ్యక్తిని ఎంచుకోవాలి. మీరిద్దరూ ఒకరినొకరు అంగీకరించవచ్చు. ప్రేమించవచ్చు. ఒకరినొకరు గౌరవించుకోవచ్చు. ఒకరితో ఒకరు నడవగలరు కూడా.

                                                *నిశ్శబ్ద.