తనవారి కోసమే... త్యాగధనుడు
posted on Oct 27, 2022 @ 11:08AM
నా యావదాస్తి మా నాన్నగారి పేరునున్న ట్రస్ట్ కి ఇచ్చేస్తున్నాను.. పేదలకు దాన్ని వినియోగించండి .. అంటూ పాత సినిమాల్లో హీరోగారు భారీ డైలాగుతో నగరంవేపు అడుగులు వేస్తాడు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం ప్రభుత్వ సంస్థ ఏపీ జెన్కో ధర్మల్ ప్రాజెక్టులో యూనిట్ నే ప్రైవేటువారి చేతుల్లో పెట్టి అందర్నీ ఆకాశంవంక చూడమన్నాడు. రాష్ట్రానికి ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న కృష్ణపట్నం విద్యు త్ ప్లాంటును ప్రయివేటుకి అంకితం చేయడానికి పూనుకున్నారు.
నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ రంగ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం జెన్కో అందరికి తెలిసిందే. జిల్లాలోని ముత్తుకూరు మండలం నేలటూరు వద్ద సుమారు 1500 వందల ఎకరాల్లో ఏర్పాటు చేసిన మొట్ట మొద టి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం. 2006 అప్పటి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 800 ×800 మెగావాట్లతో బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. నిర్మాణం పూర్తి చేసుకున్న తర్వాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేతుల మీద జెన్కో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. 2015లో చంద్రబాబు హయాంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చేతులమీదుగా ప్రారంభించారు. ఇందులో సుమారు 18వందల మంది పనిచేస్తున్నారు. దీని తర్వాత వచ్చినవి సెంబ్ కార్బ్ గాయత్రి, ఎన్ సిసి అనే రెండు ప్రయివేటు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటయ్యాయి.
కాగా టీడీపీ హయాంలో అనుమతి పొందిన మూడో యూనిట్ ను ఇటీవల జెన్కో ను నష్టాల నుంచి బయటపడేసేం దుకు అని కారణం చెబుతూ 25 ఏళ్ల లీజుకు అప్పగిస్తూ జగన్ సర్కార్ జీవో విడుదల చేసింది. వాస్తవానికి ఇది ఇటీవలి వరకూ బాగానే పనిచేస్తున్నది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్గూ జెన్కో ఉద్యోగులు, కార్మికులు పది నెలలుగా నిరసనలు చేపడుతున్నారు. మూడో యూనిట్ కూడా అందుబాటులోకి రావడం 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సిద్ధం కావడంతో మరి కొందరికి ఉద్యోగాలు దొరుకుతాయని ఆశించిన స్థానికుల ఆనందం ఆవిరైపోయింది. నష్టాల సాకుతో జెన్కో ఉద్యోగులను నమ్మించే ప్రయత్నాలు చేస్తూ జగన్ తనకు సన్నిహితులయిన వారి ప్రయివేటు సంస్థ నెల్లూరు జిల్లా లోని దామోదరం సంజీవయ్య ధర్మల్ పవర్ స్టేషన్ ప్లాంటును కట్టబెట్టే యత్నాలు చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే, అసలు కృష్ణపట్నం విద్యుత్ కేంద్రాన్ని ప్రయివేటుకు లీజు విష యంలో క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి ఉద్యోగులు, భూములిచ్చిన నిర్వాసితుల ఆధ్వ ర్యంలో ఉద్యమిస్తున్నారు. కానీ లీజు ప్రకటనకు అనుగుణంగా ఈ నెల 30న టెండర్లకు పిలుపు నిచ్చింది ప్రభుత్వం.
సామర్ధ్యం కలిగిన ఇంజనీరింగ్ సిబ్బంది, నైపుణ్యం కలిగిన ఉద్యోగులు ఉండి కూడా సంస్థను ప్రయివేటు పరం చేయడం కేవలం రాజకీయ స్వార్ధం కోసమే తీసుకున్న నిర్ణయమనాలి. సవ్యంగా నడిచేవాటిని కూడా ఎందుకు పనికి రావని చూపించి తన ప్రభుత్వ హయాంలో ఇంతటివి ఉండడాన్ని తానే ప్రచారం చేసుకోవడం విని ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇదేమీ జగనన్నా.. నువ్వే అలా చేస్తే ఎలా అనుకుంటున్నారు. ఉత్పత్తి సరిగా లేని యూనిట్లను వాటిలో పనిచేసేవారిని ఉత్సాహపరిచి దాన్ని కూడా మంచి ఉత్పత్తి సాధించే దిశగా దిశా నిర్దేశం చేయాల్సిన ముఖ్యమంత్రి ఏకంగా ప్రయివేటువారికి ధారాదత్తం చేయడం దుర్మార్గమనే ఉద్యోగులు అంటున్నారు. ప్రబుత్వానికే యూనిట్ లో పనిచేసే సిబ్బందిపట్ల నమ్మకం లేకపోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రబుత్వం నుండి తగిన మద్దతు లేకపో వడం పట్ల ఉద్యోగులు, ఇతర సిబ్బంది ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కేవలం తన వారిని ఆదుకోవ డానికే జగన్ ప్రయివేటు పరం చేయాలన్న నిర్ణయం తీసుకోవడం దారుణం.
అయితే సామర్థ్యం కలిగిన ఇంజనీరింగ్ సిబ్బంది నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కారణంగా ఈ ప్లాంటు ఇతర ప్రైవేటు ప్లాంట్లతో పోటీ పడుతూనే ఉంది. అయినా సంస్థను నష్టాలలో ఉన్నట్లుగా చూపుతూ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు ప్రభుత్వం తహతహలాడుతుండటం ఇప్పుడు సర్వత్ర విమర్శలకు తావిస్తుంది. కర్మాగారం నిర్మించేప్పుడు ఇక్కడి నిర్వశితులను ఇతర ప్రాంతాలకు తరలి స్తామని, కుటుంబంలొ ఒకరికి ఉధ్యోగం ఇస్తామన్న హామీలు ఏమాత్రం ప్రభుత్వం నెరవేర్చక పోయినా తమ ప్రాంతంలొ ప్రభుత్వ రంగ సంస్థ ఉంది ఏదోక రోజు తమ పిల్లలు చదువుకోని ఇక్కడ ఉద్యోగాలు సంపాదించు కుంటారన్న దీమాతొ ఉన్నామని ఇప్పడు పరిశ్రమ ప్రయివేటు వ్యక్తుల చేతుల్లోకి వేళ్ళి పోతె తమ పరిస్థితి ఏంటన్న ఆందోళనలో ఉన్నారు ఇక్కడి ప్రజలు. ఎట్టి పరిస్థితుల్లో విద్యూత్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రయివేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లనివ్వమంటు ఉద్యమబాట పడుతు న్నారు. ఎపి ప్రజలు మాత్రం వాటమ్మా వాటీజ్ దిస్ అమ్మా అంటూ ముక్కున వేలెసుకుంటున్నారు.