సచిన్ కు రాసిన లేఖ.. 76 లక్షల నిధులు గ్రాంట్
posted on Jun 13, 2016 @ 5:22PM
రాజ్యసభ సభ్యుడు, టీమిండియా మాజీ క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రాసిన లేఖ.. ఒక స్కూల్ దుస్థితినే మార్చేసింది. పశ్చిమబెంగాల్ పశ్చిమ మిడ్నపూర్ జిల్లాలోని స్వర్ణమయి సస్మల్ శిక్షా నికేతన్ స్కూల్ పరిస్థితి అద్వానంగా మారింది. అయితే దీనిపై స్కూల్ యాజమాన్యం అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం మాత్రం శూన్యం. దీంతో ఆఖరికి విద్యార్ధులు, ఉపాధ్యయులు సచిన్ టెండూల్కర్ కి తమ స్కూలు దుస్థితిని వివరిస్తూ ఓ లేఖ రాశారు. ఇక లేఖను అందుకున్న సచిన్ ఆ స్కూలుకి తన ఎంపీలాడ్ పథకం ద్వారా రూ. 76 లక్షల నిధులను ఇచ్చారు. దీంతో స్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 50 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ స్కూల్లో ప్రస్తుతం 900 మంది విద్యార్థులు విద్యను కొనసాగిస్తున్నారు. సచిన్ స్పందించడంతో తమ స్కూలు ఇక బాగుపడుతోందని విద్యార్థులు సంబరపడిపోతున్నారు.