ఏపీ రాజధాని విజయవాడేనా?... సచిన్ ఆరా...
posted on Aug 2, 2014 @ 11:30AM
ఆంధ్రప్రదేశ్ రాజధాని అయ్యే అవకాశం వుందని భావిస్తున్న విజయవాడ నగరం సమీపంలో వున్న మంగళగిరిలో సచిన్ టెండూల్కర్ భారీగా భూములు కొన్నట్లుగా గతంలో పుకార్లు వచ్చాయి. అయితే ఆ పుకార్లను సచిన్ సన్నిహితులు కొట్టిపారేశారు. రియల్ ఎస్టేట్ బూమ్ కోసమే రియల్టర్ ఇలాంటి పుకార్లను వ్యాపింపచేశారని అన్నారు. అయితే తాజాగా విజయవాడలో శుక్రవారం నాడు ప్రముఖ వ్యాపారవేత్త పొట్లూరి వరప్రసాద్ నిర్మించిన పీవీపీ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన సచిన్ ప్రారంభోత్సవం తర్వాత విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాజధాని అవడం ఖాయమైనట్టే కదా అని పొట్లూరి వరప్రసాద్ దగ్గర ఆరా తీసినట్టు తెలుస్తోంది. ప్రారంభోత్సానికి వచ్చిన సచిన్ ఆ పనేదో చేసుకుని వెళ్ళకుండా ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి అంత ప్రత్యేకంగా ఎందుకు అడిగాడు? ఒకవేళ సచిన్ నిజంగానే మంగళగిరిలో భూములు కొన్నాడేమో.. తన భూముల విలువ పెరుగుతుందో లేదో తెలుసుకోవడానికే సచిన్ ఇలా ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి ఆరా తీశాడేమో అనే అంచనాలను ఊహాజీవులు వేస్తున్నారు.