ప్రవేటు బస్సులను స్వాధీనపర్చుకోబోతున్న ఆర్టీసీ ?
posted on Jul 11, 2012 9:04AM
ఒకచోటనుండి మరోచోటికి ప్రయాణీకులను తీసుకు వెళ్లవలసిన ప్రైవేటు బస్సులు ఆర్టీ బస్సులు లాగా స్టేజి క్యారియర్లుగా నడిపిస్తూ ఆర్టీసికి గండకొడుతున్నారని భావించిన ఆర్టీసి ముఖ్యకార్యదర్శి లక్ష్మీ పార్ధసారధి ప్రైవేటు బస్సులన్నిటిని ఆర్టీసీ ఆధీనంలోకి తీసుకోవాలని యోచిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు ఆర్టీసీ యాజమాన్యం సిద్దమైతే పూర్తిస్థాయిలో ప్రతిపాదనలు రూపొందిస్తామని ఆమె తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1215 ఆధునిక బస్సులు, 1300 టూరిస్టు బస్సులు ఉన్నాయన్నారు.
అయితే ఆర్టీసీ ఆధీనంలోకి తెచ్చుకున్న ప్రైవేటు బస్సులకు కిలోమీటరు చొప్పున చెల్లించడమా లేదా ఏదైనా ప్రత్యేక ప్యాకేజి ప్రకటించడమా అనే విషయం పై ఆర్టీసి కసరత్తు చేస్తుంది. దీనివల్ల ఆర్టీసీ లాభాల బాట పట్టగలదని అధికారులు భావిస్తున్నారు. ఈ మద్య రవాణాశాఖ నిర్వహించిన దాడుల కారణంగా ఆర్టీసీ ఆదాయం రోజుకు కోటినుండి కోటిన్నర వరకు పెరగటంతో ఆర్టీసి ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ప్రైవేటు బస్సులు లాభదాయకమైన హైదరాబాద్, బెంగుళూరు, షిర్టీ, ముంబాయి,పూణే, షోలాపూర్ లాంటి లాభదాయక రూట్లలో నడుస్తున్నాయి. ప్రస్తుతం ఆర్టీసీలో 3798 అద్దె బస్సులు ఉన్నాయి. అందులో చాలావరకు పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌లే ఉన్నాయి. అదె అద్దె బస్సుల్లో మెర్సిడెస్ కంపెనీ బస్సులుకూడా ఉన్నాయి ఈ బస్సులను ఆర్టీసి పరం చేస్తే కొత్తబస్సుల కొనుగోలు భారం ఉండదని ఆర్టీసీ భావిస్తుంది.
ప్రస్తుతం ఆర్టీసీలో వెన్నెల ఎసి స్లీపర్లు 15, గరుడ ప్లస ఎసి 40, ఏసిగరుడ 102, ఇంద్ర ఎసి 101 ,ఏసి మేఘదూత్ 6 ఉన్నాయి. ఇందులో వెన్నెల ప్లస్, గరుడ ప్లస్‌లు మాత్రమే కొత్తవి కాగా మిగిలినవన్నీ పాతవయ్యాయి. కాబట్టి ఇప్పుడు ప్రవేటు బస్సుల అప్పగింత ఆర్టీసిన లాభాలబాట పండిరచేదిగా ఉంటుందని ఆర్టీసి యాజమాన్యం భావిస్తుంది . అయితే ఈ విషయమై ప్రవేటు బస్సు యాజమాన్యం భిన్నాభిప్రాయం వ్యక్తంచేస్తుంది. ఇవన్నీ అభూతకల్పనగానే ప్రైవేటు బస్సు ఆపరేటర్ల సంఘం ప్రధాన కార్యదర్శి బోస్ చెబుతున్నారు. ఈ విషయమై ఆర్టీసి యాజమాన్యం తమను సంప్రదించలేదని తెలిపారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం ప్రైవేటు వాహనాలను ఆర్టీసీ పరం చేసికొని నిర్వహణ చేతకాక చేతులు కాల్చుకుందని, అయినా ప్రభుత్వం అప్పగించ మంటే అప్పగిస్తామా అని అన్నారు.